Homeఆంధ్రప్రదేశ్‌మీడియా ముసుగులో చెంచాగిరి.. ఆర్కేపై సోము వీర్రాజు ఫైర్..

మీడియా ముసుగులో చెంచాగిరి.. ఆర్కేపై సోము వీర్రాజు ఫైర్..

Somu Veerraju ABN RK
ఏబీఎన్ చానల్ పై ఏపీ కమలం పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. స్టూడియోకు పిలిచిమరీ తమ నాయకుడిని అవమానించారని ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే పై ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తానన్న మాటకు వీర్రాజు కట్టుబడ్డారు. తన పర్యటనకు ఆంధ్రజ్యోతి.. ఏబీఎన్ ను ఆహ్వానించకపోవడమే గమనార్హం. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై ఏబీఎన్ చానల్లో జరిగిన దాడిని నిరసిస్తూ.. ఆ మీడియా గ్రూపును బహిష్కరిస్తున్నట్లు ఏపీ బీజేపీ శాఖ మూడు రోజుల క్రితమే ప్రకటించింది.

Also Read: వైసీపీని భయపెడుతున్న నిమ్మగడ్డ..?

తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా మీడియా ముసుగులో పని ఏబీఎన్ పని చేస్తోందని.. దాన్ని ఎలాంటి మీడియా సమావేశాలకు ఆహ్వానించకూడదని, ఆ టీవీ చానల్ చర్చల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ.. ఏబీఎన్ చానల్ తనకు నచ్చిన వారిని ఆహ్వానించి.. వాయిస్ గా ప్రచారం చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తే… చానల్ పై చట్టపరమైన చర్యలు వెనకాడమని పార్టీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్మ్షీ నారాయణ నిర్వహించిన మీడియా సమావేశానికి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ను కూడా ఆహ్వానించారు. ఈ విషయంపై తన వారాంతపు కొత్త పలుకులో ఆర్కే ప్రస్తావించడంతో పటు ప్రశ్నించారు. మీరు వద్దనుకున్నా.. మీ వాళ్లను పిలిచి స్టూడియోలో కూర్చుండబెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. అయితే తన నిర్ణయాన్ని పార్టీ నాయకులే గౌరవిడం లేదన్న అనుమానం సోము వీర్రాజును పట్టి పీడిస్తుందని అన్నారు.

Also Read: రేణిగుంట విమానాశ్రయంలో బైటాయించిన చంద్రబాబు.. నేలపై కూర్చొని నిరసన.. తీవ్ర ఉద్రిక్తత

ఈ నేపథ్యంలో విశాఖలో పర్యటించిన సోము వీర్రాజు 29వ వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో దశావతార కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. గెలిచేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. మాట విననివారిపై కేసులు పెడుతుందని విమర్శించారు. అనర్హత, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, రౌడీ షీట్లు పెడుతోందని సోము వీర్రాజు విమర్శించారు.

కాగా.. సోము వీర్రాజు విశాఖ పర్యటన నేపథ్యంలో మీడియా సమావేశానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని పిలువలేదు. దీంతో అతడి పర్యటనకు సంబంధించిన వార్తలు పేపర్లోనూ.. ఆ చానల్ లోనూ ఎక్కడా కనిపించలేదు. పిలవని వారి వార్తలు తామేందుకు రాయాలనే భావన ఆంధ్రజ్యోతిలో కనిపించింది. మొత్తానికి పట్టింపులకు పోతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఏబీఎన్ పై బహిష్కరణ అమలు చేస్తున్న క్రమంలో సోము వీర్రాజు పౌరుషంగా ఉన్నారని పార్టీ శ్రేణులు అంటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version