https://oktelugu.com/

ముఖానికి మేకప్ వేసుకుంటున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

యువతులు, మహిళల్లో చాలామంది ఫంక్షన్లకు, బయటకు వెళ్లే సమయంలో మేకప్ వేసుకుని బయటకు వెళుతున్నారు. మేకప్ వేసుకోవడం ఈ మధ్య కాలంలో సాధారణం అయిపోయింది. అయితే మేకప్ వేసుకునే సమయంలో స్కిన్ పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మేకప్ వేసుకునే వాళ్లు సరైన మెలుకువలు పాటించని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మేకప్ తరచూ వేసుకునే వాళ్లు కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. మేకప్ ను పూర్తిగా తొలగించిన తరువాత ముఖం శుభ్రంగా కడుక్కోవడంతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 1, 2021 / 11:55 AM IST
    Follow us on

    యువతులు, మహిళల్లో చాలామంది ఫంక్షన్లకు, బయటకు వెళ్లే సమయంలో మేకప్ వేసుకుని బయటకు వెళుతున్నారు. మేకప్ వేసుకోవడం ఈ మధ్య కాలంలో సాధారణం అయిపోయింది. అయితే మేకప్ వేసుకునే సమయంలో స్కిన్ పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మేకప్ వేసుకునే వాళ్లు సరైన మెలుకువలు పాటించని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

    మేకప్ తరచూ వేసుకునే వాళ్లు కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. మేకప్ ను పూర్తిగా తొలగించిన తరువాత ముఖం శుభ్రంగా కడుక్కోవడంతో పాటు మేకప్ ను తొలగించేందుకు నాణ్యమైన మాయిశ్చరైజర్ నే వినియోగించాలి. మేకప్ ను తొలగించకుండా అలాగే ఉంచుకుంటే చర్మ రంధ్రాలు మూసుకుపోవడంతో పాటు ముఖంపై ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. మేకప్ ఎక్కువ సమయం ఉంచుకుంటే పెదాలు తేమను కోల్పోయి పొడిబారే అవకాశం ఉంటుంది.

    మేకప్ ను తొలగించిన తరువాత పెదవులపై తేనెను రాసుకుంటే మంచిది. మేకప్ ఇష్టం లేని వారు మార్కెట్ లో సహజ పదార్థాలతో తయారు చేసిన సీరమ్ లను వినియోగిస్తే మంచిది. రాత్రి పడుకునే సమయంలో సీరమ్ ను వినియోగిస్తే చర్మ గ్రంథులు ఉత్తేజితం కావడంతో పాటు నిగారింపుతో కనిపిస్తాయి. ఐషాడో వేసుకోవడం వల్ల కళ్ల అందం రెట్టింపు అవుతుందనే సంగతి తెలిసిందే.

    అయితే ఐషాడోను రోజులో ఎక్కువ సమయం ఉంచుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్లు ఎర్రగా మారడం లాంటి సమస్యలు ఐ షాడో వేసుకున్న వాళ్లకు ఎదురవుతాయి. పాలలో ముంచిన దూది లేదా కెమికల్స్ లేని రిమూవర్ తో ఐ షాడోను సులభంగా రిమూవ్ చేయడం సాధ్యమవుతుంది.