Indian Rupee Depreciation: కొంతకాలంగా… రూపాయి విలువ పడిపోయింది.. జీవితకాల కనిష్టానికి చేరుతుంది.. డాలర్ విలువ అంతకంతకు పెరుగుతోంది.. ఈ పతనం ఎక్కడదాకా.. దీనివల్ల విదేశీ మరక ద్రవ్య నిలువల మీద ఒత్తిడి పెరిగిపోతుంది.. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ మరింత ఇబ్బందులలో పడుతుందని మన నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని పిలుపునిచ్చారు.
బంగారం కొనుగోలు చేయొద్దని.. విదేశాలకు వెళ్లొద్దని.. ఆడంబరాలకు పోవద్దని.. ఉన్నంతలో బతకాలని ఇంకా రకరకాల పొదుపు సూత్రాలను ఆయన చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఆయన చెప్పినట్టుగానే బంగారం మీద చాలామంది వ్యామోహం తగ్గించుకున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి తగ్గించుకున్నారు. ఇంకా రకరకాల పొదుపు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. అయినప్పటికీ డాలర్ పెరుగుతూనే ఉంది. రూపాయి మీద ఒత్తిడి ఎక్కువ అవుతూనే ఉంది.. ఎందుకిలా జరుగుతోంది..
నిజానికి మనదేశంలో బంగారం మీద మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రకాల వస్తువుల మీద విదేశీ మారకద్రవ్యాన్ని మన ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. అందులో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు తయారీకి ఉపయోగించే చిప్.. ఇతర వస్తువుల కోసం భారీగా వెచ్చిస్తోంది. అదేంటి స్మార్ట్ ఫోన్ల తయారీ మన దేశంలో పెరిగిపోయింది కదా.. మొత్తంగా ఇక్కడ తయారయ్యి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి కదా.. చివరికి ఆపిల్ కంపెనీ కూడా ఐఫోన్లను మన దగ్గరే అసెంబుల్ చేయిస్తుంది కదా.. ఇంకా ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారు కదా.. నిజమే.. కానీ అక్కడే ఉంది అసలైన లాజిక్.
స్మార్ట్ ఫోన్ల తయారీకి ఉపయోగించే చిప్ లు, ఇతర రా మెటీరియల్ మొత్తం చైనా లేదా తైవాన్ నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మన దేశం నుంచి ఏడు డాలర్ల విలువైన ఫోన్ ఒకటి తయారుచేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే.. అందులో వాడే ముడి పదార్థాలు.. ఇతర పరికరాల కోసం దాదాపు మూడు డాలర్ల వరకు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా విదేశాలకు చెల్లించాలి. వాటిని డాలర్ రూపంలో చెల్లిస్తే మనకు ఆ పరికరాలు దిగుమతి అవుతాయి. కొంతకాలంగా మనదేశంలో స్మార్ట్ పరికరాల తయారీ పెరిగిపోయింది. మేక్ ఇన్ ఇండియా.. మేడిన్ ఇండియా అని నినాదాల వల్ల స్థానికంగా అనేక ఉత్పత్తులు తయారీ అవుతున్నాయి. వీటి తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తుంది. అందువల్లే భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
చాలామంది అనుకుంటున్నట్టుగా బంగారం కోసం.. యూరియా కోసం.. ఇతర వాటి కోసం మన దేశం భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. వాటికంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ పరికరాల కోసం వెచ్చిస్తోంది. అందువల్లే రూపాయి మీద ఒత్తిడి పెరిగిపోతోంది.. అయితే విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల మరికొద్ది సంవత్సరాలలో మనదేశంలో కూడా చిప్ తయారీ కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మన దేశంలోనే అవి తయారవుతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అప్పటిదాకా ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిందే.
