జాతీయ వార్తలుకేసీఆర్‌‌కు స్వల్ప అనారోగ్యం

కేసీఆర్‌‌కు స్వల్ప అనారోగ్యం

CM KCR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారినపడ్డారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో సీఎం ఆయా టెస్టులు చేయించుకోనున్నారు. వ్యక్తిగత వైద్యుడి సూచనల మేరకే ఆయన హాస్పిటల్‌కు వెళ్లారని తెలుస్తోంది. కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లారనే వార్త తెలియగానే టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదని సమాచారం.

Also Read: అది చంద్రబాబు కుట్రేనన్న బీజేపీ ఎంపీ

తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో జస్టిస్‌ హిమాకోహ్లితో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచే ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు.

గతేడాది ఆరంభంలోనూ సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోదా హాస్పిటల్‌కు వెళ్లారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడ యశోదా హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్నారు. సీఎంను టెస్టు చేసిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Also Read: కిడ్నాప్ కథలో అనూహ్య మలుపు.. అఖిలప్రియనే సూత్రధారి?

సీఎం ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదురుగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

KTR Padayatra : కేటీఆర్ పాదయాత్ర.. తెలంగాణ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ అవుతుందా..

KTR Padayatra : తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ అంతగా కనిపించడం లేదు. అలాగని భవిష్యత్ కాలంలో ఏర్పడదు అని చెప్పడానికి లేదు. రాజకీయాలు స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉంటే వాటిని రాజకీయాలు...

CM Revanth Reddy: రేవంత్ వ్యూహం.. అభివృద్ధి కోసం కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం!

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పార్టీ రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించిన తర్వాత బీజేపీ ఎంపీలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Exit mobile version