https://oktelugu.com/

కేసీఆర్‌‌కు స్వల్ప అనారోగ్యం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారినపడ్డారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో సీఎం ఆయా టెస్టులు చేయించుకోనున్నారు. వ్యక్తిగత వైద్యుడి సూచనల మేరకే ఆయన హాస్పిటల్‌కు వెళ్లారని తెలుస్తోంది. కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లారనే వార్త తెలియగానే టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదని సమాచారం. Also Read: అది చంద్రబాబు కుట్రేనన్న బీజేపీ ఎంపీ తెలంగాణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2021 / 03:17 PM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం బారినపడ్డారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో సీఎం ఆయా టెస్టులు చేయించుకోనున్నారు. వ్యక్తిగత వైద్యుడి సూచనల మేరకే ఆయన హాస్పిటల్‌కు వెళ్లారని తెలుస్తోంది. కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లారనే వార్త తెలియగానే టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదని సమాచారం.

    Also Read: అది చంద్రబాబు కుట్రేనన్న బీజేపీ ఎంపీ

    తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో జస్టిస్‌ హిమాకోహ్లితో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచే ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు.

    గతేడాది ఆరంభంలోనూ సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోదా హాస్పిటల్‌కు వెళ్లారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడ యశోదా హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్నారు. సీఎంను టెస్టు చేసిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

    Also Read: కిడ్నాప్ కథలో అనూహ్య మలుపు.. అఖిలప్రియనే సూత్రధారి?

    సీఎం ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదురుగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్