Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెఫ్ అవతారం ఎత్తారు. సుతారంగా గోధుమపిండిని కలిపి.. ముద్దలు చేసి.. వేడి వేడి నూనెలో కాల్చి.. మెత్తటి పూరీలు చేశారు. కాకపోతే అవి పూరీలు మాదిరిగా లేవు. రకరకాల రూపాలలో వచ్చాయి. వాటిని చూసి ఆయన మనవడు ఆశ్చర్యపోయారు. తాత అవన్నీ కూడా రౌండ్ గా రాలేదు. ఓవల్ షేప్ లో వచ్చాయి అంటుండగా రేవంత్ రెడ్డి.. రౌండ్ గా చేయాలా.. రౌండ్ గా చేస్తాను అంటూ మనవడికి బదులిచ్చారు. ఈ సన్నివేశం రేవంత్ రెడ్డి స్వగృహంలో వంటగదిలో చోటుచేసుకుంది.
తీరికలేని పని ఒత్తిడి.. రకరకాల వ్యవహారాలలో రేవంత్ రెడ్డి నిత్యం బిజీగానే ఉంటారు. ప్రజా జీవితంలో ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్నది లేదు. చివరికి కొడంగల్ ప్రాంతంలో 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ.. ఆయనను ప్రజలు ఖాళీగా ఉంచలేదు. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఆయనను ఎంపీగా గెలిపించారు. ఒకరకంగా ఆయన ఖాళీగా ఉండకూడదని తెలంగాణ ప్రజలు తీర్మానించుకున్నారు. అందువల్లే 2019 లో ఎంపీని చేశారు. 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. కేవలం 20 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే రేవంత్ రెడ్డి మిడ్జిల్ జెడ్పిటిసి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు.
రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు నైమిశ. ఆమెకు ఒక కుమారుడు. నైమిశ కు కుమారుడు పుట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒక రకంగా మనవడిని తన వారసుడిగా పరోక్షంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. తన ఒత్తిడిని.. తన కాలక్షేపాన్ని మొత్తం మనవడి తోనే సాగిస్తుంటారు రేవంత్. రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి కూడా మనవడితోనే ఎక్కువ కాలం గడుపుతుంటారు. తన మనవడు అడిగింది చేసి పెడుతుంటారు రేవంత్ రెడ్డి. ఆమధ్య మెస్సి గోట్ టూర్లో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు.. మనవడిని తీసుకొచ్చారు రేవంత్. మెస్సితో షేక్ హ్యాండ్ కూడా ఇప్పించారు. అప్పట్లో తిరుమల వెళ్ళినప్పుడు.. యాదగిరిగుట్టకు వెళ్లినప్పుడు.. భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవానికి హాజరైనప్పుడు.. రేవంత్ రెడ్డి తన మనవడిని వెంట తీసుకొని వెళ్లారు. ఇప్పుడు ఏకంగా మనవడి కోసం పూరీలు చేసి.. అతని ఆనందాన్ని రెట్టింపు చేశారు. అన్నట్టు రేవంత్ రెడ్డి పూరీలు ఇష్టంగా తింటారు. అందులో బుడంకాయ పప్పు లేదా నాటుకోడి పెట్టుకొని తింటారు.
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు…
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..#Family pic.twitter.com/TXDbufWCdY
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2026
