https://oktelugu.com/

ట్రాక్టర్ల ర్యాలీతో కాక పుట్టించిన రైతులు

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. 43 రోజులుగా చలి, వర్షాలను లెక్కచేయకుండా చట్టాల రద్దుకు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఏడు విడతల్లో చర్చలు నిర్వహించినా.. అన్నదాతలకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీకి నాలుగు సరిహద్దుల వైపు ట్రాక్టర్ల ర్యాలీలను చేపట్టారు. సుమారు 40 రైతు సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. Also Read: కిడ్నాప్ కథలో అనూహ్య మలుపు.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2021 3:29 pm
    Follow us on

    Farmers tractor march
    కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. 43 రోజులుగా చలి, వర్షాలను లెక్కచేయకుండా చట్టాల రద్దుకు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఏడు విడతల్లో చర్చలు నిర్వహించినా.. అన్నదాతలకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీకి నాలుగు సరిహద్దుల వైపు ట్రాక్టర్ల ర్యాలీలను చేపట్టారు. సుమారు 40 రైతు సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు.

    Also Read: కిడ్నాప్ కథలో అనూహ్య మలుపు.. అఖిలప్రియనే సూత్రధారి?

    మరోవైపు.. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ వాహనదారులకు అధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. కాగా.. రైతులు బుధవారమే ఈ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని తలిచినా వర్షం కారణంగా వాయిదా పడింది. శుక్రవారం కేంద్రం, రైతు సంఘాలు మరోసారి సమావేశం కానున్న నేపథ్యంలో అన్నదాతలు దీనిని నిర్వహిస్తున్నారు.

    గణతంత్ర దినోత్సవం రోజున కిసాన్‌ పరేడ్‌ పేరుతో నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఇది సన్నాహకంగా ఉంటుందని రైతు సంఘాలు అంటున్నాయి. కాగా.. వ్యవసాయ చట్టాలపై దాఖలైన అన్ని పిటిషన్లపై ఈనెల 11న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు గతంలోనే ప్రకటించింది. ఇరువర్గాల మధ్య చర్చలను ప్రోత్సహిస్తామని తెలిపింది.

    Also Read: ట్రంప్‌ దిగిపోక తప్పదా..? : వేటు వేసేందుకు కేబినెట్‌ సిద్ధం

    ఇదిలా ఉండగా.. తమ డిమాండ్లపై స్పందించకుంటే ఈ నెల 8 నుంచి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. జనవరి 13, 14 తేదీల్లో సాగు చట్టాల ప్రతులను దహనం చేస్తామని వెల్లడించాయి. ఈనెల 18న మహిళా కిసాన్‌ దివస్‌ పేరుతో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆజాద్‌ హింద్‌ కిసాన్‌ దివస్‌ను నిర్వహించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ రాజ్‌పథ్‌లో ట్రాక్టర్లతో రైతు కవాతు నిర్వహించనున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్