KCR- Sitting MLAs: సిట్టింగ్ లకు సీట్లు ఊస్ట్: కేసీఆర్ ఇచ్చిన షాక్

టికెట్‌ విషయంలో అధినేత చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయిస్తుండగా, ఎమ్మెల్యేలు కూడా సొంతంగా సర్వే చేయించుకుంటున్నారు.

Written By: Bhaskar, Updated On : May 27, 2023 12:00 pm

KCR- Sitting MLAs

Follow us on

KCR- Sitting MLAs: ” సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తా. 105 స్థానాల్లో భారత రాష్ట్ర సమితి గెలుస్తుంది. మూడోసారి అధికారంలోకి వస్తుంది. ప్రతిపక్షాలవన్నీ చిల్లర మల్లర విమర్శలు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. దేశంలో వినూత్నమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ భారత రాష్ట్ర సమితి తిరుగులేని స్థానంలో ఉంది. కచ్చితంగా అధికారంలోకి వస్తుంది” ఇవీ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల వరకు అసమ్మతి లేకుండా చూసుకొని, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని నెమ్మదిగా సాగనంపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రతికూలంగా పరిణమించాయి

రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని, ఆ ఊపుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా పరిణమించాయి. స్వయంగా కేసీఆర్‌ చేయిస్తున్న సర్వేల్లోనే ఈ విషయం వెల్లడవుతోంది. చాలా మంది బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేల పనితీరు అంతంతమాత్రంగానే ఉందని, వారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలినట్లు సమాచారం. అయితే జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలంటే ముందుగా రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని భావిస్తున్న కేసీఆర్‌.. ఇందుకోసం గెలుపు గుర్రాలకే టికెట్లివ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో సిటింగ్‌ ఎమ్మెల్యేలను తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందుగానే ప్రకటిస్తే ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురై ప్రత్యర్థి పార్టీల్లో చేరే అవకాశం ఉంటుందని, అందుకే ఆ ఎమ్మెల్యేల జాబితాను, సర్వే వివరాలను రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వంపై, బీఆర్‌ఎస్‌ పార్టీపై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగినట్లుగా సర్వేల్లో తేలిందని, దీంతో ముఖ్యమంత్రి మరింత అప్రమత్తమయ్యారని అంటున్నారు. ఈ మేరకే.. గతంలో సిటింగ్‌లకే టికెట్లు ఇస్తానన్న కేసీఆర్‌.. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రజల్లో గ్రాఫ్‌ సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇచ్చేది లేదని చెప్పినట్లు తెలిసింది. జనంలో మంచి అభిప్రాయం లేనివారికి టికెట్‌ ఇచ్చి సీట్లు కోల్పోయే స్థితిలో తాము లేమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వేలు చేయించిన కేసీఆర్‌.. ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న మార్పులపైనా రహస్య సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో.. బీఆర్‌ఎస్‌ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినట్లుగా సీఎం దృష్టికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీలోనూ అంతర్గత కలహాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకులు.. ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్ఠానం తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతికూలతలను అధిగమించేందుకు అటు అధినేత కేసీఆర్‌తోపాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్‌లో, ప్రజల్లో ఏయే వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నది సర్వేల ద్వారా సేకరించి.. ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలన్న దానిపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత

పార్టీపై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగినట్లుగా సర్వేల్లో తేలిందని, దీంతో ముఖ్యమంత్రి మరింత అప్రమత్తమయ్యారని అంటున్నారు. ఈ మేరకే.. గతంలో సిటింగ్‌లకే టికెట్లు ఇస్తానన్న కేసీఆర్‌.. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రజల్లో గ్రాఫ్‌ సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇచ్చేది లేదని చెప్పినట్లు తెలిసింది. జనంలో మంచి అభిప్రాయం లేనివారికి టికెట్‌ ఇచ్చి సీట్లు కోల్పోయే స్థితిలో తాము లేమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వేలు చేయించిన కేసీఆర్‌.. ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న మార్పులపైనా రహస్య సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో.. బీఆర్‌ఎస్‌ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినట్లుగా సీఎం దృష్టికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీలోనూ అంతర్గత కలహాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకులు.. ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్ఠానం తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతికూలతలను అధిగమించేందుకు అటు అధినేత కేసీఆర్‌తోపాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్‌లో, ప్రజల్లో ఏయే వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నది సర్వేల ద్వారా సేకరించి.. ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలన్న దానిపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

ఎమ్మెల్యేల సొంత సర్వేలు

టికెట్‌ విషయంలో అధినేత చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయిస్తుండగా, ఎమ్మెల్యేలు కూడా సొంతంగా సర్వే చేయించుకుంటున్నారు. వరుసగా రెండు పర్యాయాలుగా అధికారంలో ఉండటంతో.. నియోజకవర్గంలో తమ గ్రాఫ్‌ ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. దాంతోపాటు ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉందనే అంశంపైనా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆ నియోజకవర్గంలోని గ్రామాలకు ఇన్‌చార్జులుగా వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. అక్కడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, వారు వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నదీ ప్రత్యక్షంగా చూశారు. వాటి ఆధారంగా తమ నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఏదైనా అంశంలో తమపై వ్యతిరేకత ప్రదర్శిస్తే.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు ఆశావహులు కూడా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం.