Homeఆంధ్రప్రదేశ్‌NTR - Lakshmi Parvathi : ఎన్టీఆర్ జయంతి : కడవరకూ లక్ష్మీపార్వతి తోడు.. అంపశయ్యపై...

NTR – Lakshmi Parvathi : ఎన్టీఆర్ జయంతి : కడవరకూ లక్ష్మీపార్వతి తోడు.. అంపశయ్యపై ఆనాడు

NTR – Lakshmi Parvathi : ఎన్టీఆర్.. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా వైబ్రేషన్ పుట్టించిన పేరు అది. కనిపించే మూడు సింహాలు నటన.. కనిపించని నాలుగో సింహమే రాజకీయం అనేంత క్రేజ్ ఎన్టీఆర్ సొంతం. ఆహార్యం, అభినయం,  వాగ్ధాటి, డైలాగుల్లో స్పష్టత ఎన్టీఆర్ కు వరాలు. అందుకే ఆయన కనిపిస్తే కనక వర్షం కురిసేది. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు సమాజానికి ఎంతోమంది నాయకులను అందించింది కూడా ఆయనే. అటువంటి మహోన్నతమైన నేత చివరి ఘడియల్లో వెంట నడిచింది అతి కొద్దిమంది మాత్రమే. కడుపులో పుట్టిన కన్నవారు దూరమైనా.. కడవరకూ తోడు నిలిచింది మాత్రం లక్ష్మీపార్వతే. అంపశయ్యపై ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కు సేవచేసే మహత్ భాగ్యాన్ని సైతం సొంతం చేసుకున్నది కూడా ఆమె.

అయితే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ యే ఒక వివాదం. ఏడు పదుల వయసులో ఉన్న ఎన్టీఆర్ లైఫ్ లోకి ప్రవేశించినప్పుడే చంద్రబాబు చతురత ప్రదర్శించారు. ఆమె ద్వారా పార్టీలో వచ్చే ప్రమాదాన్ని ముందుగా గుర్తెరిగారు. ఆయన చెబుతున్నట్టు పార్టీని కాపాడుకునేందుకో.. లేకుంటే ఎన్టీఆర్ రాజకీయ వారసుడు తాను తప్ప మరొకరు ఉండకూడదని భావించారో.. కానీ లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. దీనికి ఆయన తెరవెనుక సాగించిన ప్రయోగాలు అన్నీఇన్నీ కావు.   ముందుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి లలో లక్ష్మీపార్వతి పై వ్యతిరేక కథనాలు వచ్చే విధంగా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ ప్రకారం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కి సంబంధించి  అత్యంత రహస్యమైన విషయాలు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు లో ప్రచురితం కావడం వంటి వాటి వెనుక ఉన్నది చంద్రబాబే.

చంద్రబాబు ఆ రేంజ్ లో నెట్ వర్క్ నడుపుతూ వారి విషయాలను రాబడుతు ఉండేవారు. ఇది ఇలా ఉండగానే ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలో హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమం మొదలైంది. దీనికి ప్రధాన దర్శకులుగా ఈనాడు రామోజీ , ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఉండడమే కాకుండా, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ని ముందుపెట్టి కథను నడిపించడంలో వీరంతా సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేలంతా చంద్రబాబు శిబిరంలోకి వచ్చేస్తున్నారు అన్నట్లుగా ఈ రెండు పత్రికల్లో వార్తలు రావడం, మిగతా ఎమ్మెల్యేల అందరిలోనూ ఆందోళన చెలరేగడం, వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

చంద్రబాబు ద్వారా ఎదురైనా పరిణామాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ ముందుకు వచ్చి మైక్ ద్వారా ఎమ్మెల్యేలు బయటకు రావాల్సిందిగా కోరడం, వెంటనే ఆయన పై చెప్పుల వర్షం కురవడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. చంద్రబాబు చేసిన మోసానికి ఎన్టీఆర్ నిత్యం కుమిలిపోతూనే తన ఆఖరి రోజు వరకు గడిపారు. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చివరి క్షణం వరకు ఆయన వెంట నడిచింది లక్ష్మీపార్వతి మాత్రమే.  దివంగత గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, అప్పయ్యదొరతో పాటు నేటి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి కొద్దిమంది నాయకులు మాత్రమే ఎన్టీఆర్ అంతిమ ఘడియల్లో వెన్నంటి నిలిచారుట. అయితే పతి రుణాన్ని తీర్చుకోవడంలో మాత్రం లక్ష్మీపార్వతి చిరస్థాయిగా నిలిచిపోయారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version