https://oktelugu.com/

Pragya Jaiswal: ఉబికి వస్తున్న పరువాలు దాచుకోలేక ఇబ్బందిపడుతున్న ప్రగ్యా జైస్వాల్!

ప్రస్తుతం ప్రగ్యా చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. అందాలతో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : May 27, 2023 / 12:04 PM IST

    Pragya Jaiswal

    Follow us on

    Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది. సన్ ఆఫ్ ఇండియా ప్రగ్యా చివరి మూవీ. అఖండ వంటి భారీ హిట్ పడినా ఆమె దశ మారలేదు. సరైన ఆఫర్స్ లేక సతమతమవుతున్న సమయంలో ప్రగ్యా జైస్వాల్ కి అఖండ ఆఫర్ వచ్చింది. అది కూడా బాలయ్య పక్కన మెయిన్ హీరోయిన్ రోల్. దర్శకుడు క్రిష్, బోయపాటి శ్రీనుతో ప్రగ్యా జైస్వాల్ గతంలో కలిసి పని చేశారు. ఈ పరిచయాల నేపథ్యంలో ప్రగ్యాకు అఖండ ఆఫర్ వచ్చింది.

    2021 డిసెంబర్ లో విడుదలైన అఖండ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్ కి క్లీన్ హిట్ దక్కింది. అఖండ చిత్రానికి ముందు బాలయ్య పరిస్థితి కూడా ఏం బాగోలేదు. దీంతో బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ లకు ఇది మెమరబుల్ హిట్ గా నిలిచిపోయింది. హిట్ అయితే పడింది కానీ ప్రగ్యాకు ఫేమ్ రాలేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య-బోయపాటి శ్రీను ఖాతాలోకి వెళ్ళింది. దీంతో ప్రగ్యాకు కనీసం టైర్ టూ హీరో కూడా ఆఫర్ ఇవ్వలేదు. చేసేది లేక మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా మూవీ చేశారు.

    ప్రస్తుతం ప్రగ్యా చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. అందాలతో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో స్కిన్ షోకి తెరలేపింది. ఉబికి వస్తున్న పరువాలను చేతులకు అడ్డుపెట్టి మరీ కవ్వించింది. ప్రగ్యా పరువాల వేడి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. దీంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రగ్యా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

    2014లో ఓ తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ బ్రేక్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కంచె హిట్ టాక్ తెచ్చుకుంది. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా కంచె తెరకెక్కింది. అనంతరం తెలుగులో గుంటూరోడు, నక్షత్రం వంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండు నిరాశపరిచాయి. అనంతరం బోయపాటి శ్రీను జయ జానకీ నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ ఆగిపోయిన తరుణంలో డిజిటల్ కంటెంట్ పై ప్రగ్యా దృష్టి పెట్టారని సమాచారం.