బీజేపీపై పొత్తు ఉండాలా..? వద్దా..?

సినిమాల్లో విజయదుందుభి సాగించిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి కాస్త కన్ష్యూజ్ అవుతున్నాడు. తన సినిమాలోని డైలాగ్ లో చూసి రియల్ లైఫ్ లో కూడా ఇంతే రైట్ టు రైట్ గా ఉండాలని ఫ్యాన్స్ ఫాలో అవుతారు. అయితే పవన్ రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని చేసే పనులకు ఒక్కోసారి తప్పటడుగులు వేస్తున్నారని అనుకుంటున్నా.. మరికొన్ని విషయాల్లో మాత్రం సరైన నిర్ణయమే తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. జనసేన, బీజేపీతో ఉన్న బంధం బలమైనదా..? రాజకీయమైనదా..? […]

Written By: NARESH, Updated On : March 15, 2021 2:57 pm
Follow us on

సినిమాల్లో విజయదుందుభి సాగించిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి కాస్త కన్ష్యూజ్ అవుతున్నాడు. తన సినిమాలోని డైలాగ్ లో చూసి రియల్ లైఫ్ లో కూడా ఇంతే రైట్ టు రైట్ గా ఉండాలని ఫ్యాన్స్ ఫాలో అవుతారు. అయితే పవన్ రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని చేసే పనులకు ఒక్కోసారి తప్పటడుగులు వేస్తున్నారని అనుకుంటున్నా.. మరికొన్ని విషయాల్లో మాత్రం సరైన నిర్ణయమే తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. జనసేన, బీజేపీతో ఉన్న బంధం బలమైనదా..? రాజకీయమైనదా..? లేక అవసరానికి మాత్రమే వాడుకోవడమా..? తెలియక ఇరు పార్టీల్లోని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇటీవల పవన్ కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం తెలుగు రాష్ట్రాల బీజేపీకి మింగుడుపడడం లేదు.

హైదరాబాద్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన అభ్యర్థులతో నామినేషన్ వేయించిన పవన్ ఒక్కరోజులోనే తన అభ్యర్థులను వెనక్కి రప్పించుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ ఎన్నికల్లో పోటీ చేయడం మానేశారు. అయితే ఆ తరువాత జనసేన పెద్దగా ప్రభావం లేనిపార్టీ అని కొందరు నేతలు పవన్ పై కామెంట్లు చేశారు. అవసరం వచ్చినప్పుడు ప్రభావం చూపిస్తా.. అని పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన పవన్ బీజేపీపైనే ఈ వ్యాఖ్యలు అని ప్రత్యక్షంగా చెప్పలేదు.

గత సంవత్సర కాలంలో బీజేపీతో కలిసి జనసేన పలు ఆందోళన కార్యక్రమాల్లో పాలపంచుకుంటోంది. ముఖ్యంగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీ బీజేపీ నాయకుల కంటే పవన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికొచ్చేసరికి పవన్ ఒంటరిగానే పోరాటం ప్రారంభించారు. అధిష్టానాన్ని కలసినా పవన్ ను పట్టించుకోలేదు. దీంతో ఇక బీజేపీతో పొత్తు లాభం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేసి పలు చోట్ల ప్రభావం చూపింది. బీజేపీకి ఎక్కడా ప్రభావం చూపలేదు. దీంతో బీజేపీ కంటు జనసేననే ప్రజలు ఆదరిస్తారని పవన్ భావిస్తున్నారు. ఇక తిరుపతి ఎంపీ ఉప ఎన్నికపై కూడా పవన్ తమ అభ్యర్థినే నిలబెడుతున్నామని, అందుకు అధిష్టానం సహకారం ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చాడు. కానీ ఏపీ బీజేపీ నాయకులు మాత్ర ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పవన్ పీక మీదికి విషయం వస్తే తెగదెంపులకు ఏమాత్రం వెనుకాడే ప్రసక్తి లేనట్లు తెలుస్తోంది.