మున్సిపోల్స్ లో ఏ పార్టీకి ఎంత ఓట్ల శాతం?

ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు పోస్టుమార్టమే మిగిలింది. అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ తేలిపోయింది. ఇక జనసేన-బీజేపీ బోణి మాత్రమే కొట్టాయి. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై పార్టీలు దృష్టి సారించాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. నిన్న వెలువడిన ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను మించి వైసీపీ ఓట్లు పొందడం విశేషం. 73 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలతోపాటు 11 కార్పొరేషన్లను వైసీపీ […]

Written By: NARESH, Updated On : March 15, 2021 3:09 pm
Follow us on

ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు పోస్టుమార్టమే మిగిలింది. అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ తేలిపోయింది. ఇక జనసేన-బీజేపీ బోణి మాత్రమే కొట్టాయి. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై పార్టీలు దృష్టి సారించాయి.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. నిన్న వెలువడిన ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను మించి వైసీపీ ఓట్లు పొందడం విశేషం.

73 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలతోపాటు 11 కార్పొరేషన్లను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక ప్రతిపక్ష టీడీపీకి మునుపటి కంటే కూడా ఓట్ల శాతం తగ్గడం కలవరపెడుతోంది.

అధికార వైసీపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50శాతం ఓట్ల శాతం రాగా.. ఈసారి అంతకు రెండు శాతం ఎక్కువగా వైసీపీకి 52.63శాతం ఓటింగ్ వచ్చింది.

ఇక ప్రతిపక్ష టీడీపీకి 30.73 శాతం ఓటింగ్ వచ్చింది. జనసేనకు 4.67 శాతం ఓటింగ్ రాగా.. దాని మిత్రపక్షం బీజేపీకి అంతకంటే తక్కువగా 2.41 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక స్వతంత్రులకు 5.73 శాతం ఓటింగ్ రాగా.. నోటాకు బీజేపీ కంటే తక్కువగా 1.07 శాతం ఓటింగ్ ఇచ్చింది.

ఇక సీట్ల పరంగా శాతాన్ని చూస్తే వైసీపీ గె వార్డు సభ్యుల ప్రకారం 1754 కౌన్సిలర్లు/కార్పొరేటర్లు విజయం సాధించారు. ఇది 82.65శాతానికి సమానం. అలాగే వైసీపీ రెబెల్స్ 17మంది 0.80శాతం, టీడీపీ 270 మంది 12.72శాతం, బీజేపీ 8 (0.37శాతం ) ,జనసేన 19 (0.89శాతం)కు సమానం