సీఎం జగన్ ఆధీనంలోకి ‘విశాఖ’..!

ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వైసీపీ వశమయింది. ఇటీవల జరిగిన మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)పై వైసీపీ జెండా ఎగురవేసింది. ఇక్కడ వైసీపీ మేయర్ పీఠం దక్కించుకోవడంతో పార్టీలో ఎవరు మేయర్ అవుతారన్న చర్చ జరుగుతోంది. అయితే ఎవరు మేయర్ అయినా విశాఖ నగరంపై మాత్రం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఎందుకంటే ఆయన ప్రకటించిన మూడు రాజధానుల్లో విశాఖ పట్టణం కూడా ఉంది. గత కొన్ని […]

Written By: NARESH, Updated On : March 15, 2021 2:30 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వైసీపీ వశమయింది. ఇటీవల జరిగిన మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)పై వైసీపీ జెండా ఎగురవేసింది. ఇక్కడ వైసీపీ మేయర్ పీఠం దక్కించుకోవడంతో పార్టీలో ఎవరు మేయర్ అవుతారన్న చర్చ జరుగుతోంది. అయితే ఎవరు మేయర్ అయినా విశాఖ నగరంపై మాత్రం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఎందుకంటే ఆయన ప్రకటించిన మూడు రాజధానుల్లో విశాఖ పట్టణం కూడా ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీ సీటుతో పాటు పలు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ కోల్పోయింది. దీంతో ఇక్కడ వైసీపీని ప్రజలు ఆదరిస్తారా..? అన్న సందేహం ఉండేది. అంతేకాకుండా విశాఖలోని స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదని ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు టీడీపీ లాంటి వారి దీనినే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇక్కడి కార్పొరేషన్ ఎన్నికల్లో పాగా వేయడం అధికార పార్టీకి కష్టతరమైందనే చెప్పాలి. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకుంటే అటు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే కాకుండా విశాఖ స్టీల్ ప్రభావం ప్రభుత్వంపై లేదనే చెప్పేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమించారు. మొత్తానికి ఇక్కడి మేయర్ స్థానాన్ని అధికార పార్టీ గెలుచుకుంది. అయితే మేయర్ ఎవరన్న చర్చ ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతోంది.

మేయర్ ఎవరైనా విశాఖ నగరంలో జగన్ ఆధీనంలోకి మారుతుందని కొందరు అంటున్నారు. ఆయన ప్రకటించిన మూడు రాజధానుల్లో విశాఖ ఒకటి ఉండడంతో ఏ విధంగా రాజధానిని డెవలప్ చేయాలి..? అనే కోణంలో జగన్ స్వయంగా వ్యూహ రచన చేయనున్నారు. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రజలను శాంతపర్చాలనే ధోరణిలో జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.