Shocking Temple Incident: నదులను దేవతలుగా భావించి.. గొప్పగా చెప్పుకునే దేశం మనది. మహిళా దేవతలను ఆదిశక్తులుగా ఆరాధించే దేశం మనది. అది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు అత్యంత దారుణం. మాటలకందని విషాదం..
మన దేశంలో దేవతామూర్తులు కొలువుండే ప్రాంతాలుగా హిమాలయ పర్వతాల చుట్టూ ఉండే రాష్ట్రాలు పేరు పొందాయి. అందులో హిమాచల్ ప్రదేశ్ మరింత ప్రాచుర్యం పొందింది. కేదార్నాథ్ యాత్ర.. అమర్నాథ్ యాత్ర సమయంలో చాలామంది యాత్రికలు హిమాచల్ ప్రదేశ్ మీదుగా వెళుతుంటారు. హిమాచల్ ప్రదేశ్లో కొలువై ఉన్న శివుడిని.. పార్వతి దేవిని పూజిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం పార్వతి దేవి హిమాచల్ ప్రదేశ్లో సంచరించిందని.. పార్వతీ వ్యాలీ ప్రాంతంలో ఆమె నడియాడిందని తెలుస్తోంది. అందువల్లే ఈ ప్రాంతాలు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. వెనుకటి కాలంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతి వ్యాలీ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పగా విలసిల్లేది. అమర్నాథ్ యాత్ర ప్రారంభంలో.. కేదార్నాథ్ యాత్ర ప్రారంభంలో యాత్రికులు పార్వతీ వ్యాలీలో సేద తీరేవారు. అక్కడ కొలువైవున్న పార్వతి దేవిని పూజించేవారు. ఆ యాత్రల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు కురిసేవి. అంతటి వర్షాలు కురుస్తున్నప్పటికీ పార్వతీ వ్యాలీ భక్తులకు అనుకూలంగానే ఉండేది. పార్వతి దేవి నడియాడింది అనే దానికి గుర్తుగా అక్కడ అమ్మవారి ఆలయం ఉంది. అక్కడి పరిసర ప్రాంతాలు కూడా ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లేవి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రవాసులు పార్వతి వ్యాలీని తమ ఔచిత్యంగా పేర్కొనేవారు.
Also Read: Shiva And Parvati: శివ పార్వతుల దాంపత్యంలో గొప్పతనం ఏంటో తెలుసా?
ఇప్పుడు చెత్తకుప్పయింది
హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీ వ్యాలీ మాత్రమే కాకుండా కాసోల్ అనే గ్రామం కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ విస్తారంగా పెరిగిన వృక్షాలు.. హిమాని నదులు ఈ ప్రాంతానికి సరికొత్త శోభను తెచ్చేవి. పర్యటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రధాన కారణం కూడా ఇక్కడ ఉన్న ప్రకృతి రమణీయతే. అయితే కార్యక్రమంలో ఈ ప్రాంతాలు మొత్తం చెత్తకుప్పలుగా మారిపోయాయి. కొంతకాలంగా ఇక్కడే చెత్తను వేస్తున్నారు. పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని దుర్గంధ భరితంగా మార్చేశారు. ఫలితంగా ఎంతో గొప్ప పేరు పొందిన ఈ ప్రాంతాలు డంపింగ్ యార్డుల లాగా మారిపోయాయి. చివరికి ఫారెస్ట్ ఏరియా కూడా చెత్త కేంద్రంగా మారిపోయింది.. ఇక్కడ వ్యర్ధాలు విపరీతంగా పోగు పడడంతో పందులు, ఇతర జంతువులు తిరుగుతున్నాయి. ఆ రోడ్డు మీదుగా వెళ్లాలి అంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే దీనిపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధికారులు స్పందించడం లేదు. కనీసం అక్కడ చెత్తను ఇతర ప్రాంతంలోకి తరలించే ఏర్పాట్లు కూడా చేయడం లేదు. ఫలితంగా పార్వతీ మాత నడయాడిన ప్రాంతం చెత్త కేంద్రంగా మారిపోయింది. ఎంతో అనుభూతి కలిగించాల్సిన కాసోల్ ఏరియా డంపింగ్ సెంటర్ గా కనిపిస్తోంది. ఇప్పటికైనా హిమాచల్ ప్రదేశ్ అధికారులు స్పందించి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
View this post on Instagram