Mood Of The Nation Survey: మరో రెండు నెలల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజల మద్దతు ఉందో తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. బుధవారం టౌమ్స్ నౌ సంస్థ సర్వే ఫలితాలు వెల్లడించాగా, తాజాగా ఇండియా టుడే సర్వే ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఉత్తర భారత దేశంలో బీజేపీ హవా కొనసాగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాషాయ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్ షేర్‌తో 80 స్థానాలకు 70 చోట్ల గెలుస్తుందని తెలిపింది. ఎస్పీ7 స్ధానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించవచ్చని పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 62 స్థానాల్లో గెలిచింది. మిత్రపక్షం అప్నాదళ్ 2 చోట్ల విజయం సాధించింది. ఎస్పీ 15 స్ధానాలను గెలుచుకుంది. ఈసారి ఎస్పీ ఓట్ల శాతం 39 నుంచి 30 శాతానికి పడిపోతుందని పేర్కొంది.
ఉత్తరాదిన కమలం హవా..
ఉత్తర భారత దేశంలోకి కీలక రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఇండియా టుడే సర్వే తేల్చింది. రాష్ట్రాల వారీగా సీట్లు పరిశీలిస్తే..
•ఉత్తరప్రదేశ్: బీజేపీ-70, ఎస్పీ-07, కాంగ్రెస్-01
తమిళనాడు: డీఎంకే-39 స్వీప్
•కర్ణాటక: బీజేపీ-24, కాంగ్రెస్-04
•రాజస్థాన్: బీజేపీ-25 స్వీప్
•మధ్యప్రదేశ్: బీజేపీ-27, కాంగ్రెస్-02
•ఛత్తీస్‌గఢ్: బీజేపీ-10, కాంగ్రెస్-01
పశ్చిమబెంగాల్: బీజేపీ-19, టీఎంసీ-22, కాంగ్రెస్-01
బిహార్: ఎన్డీఏ-32, ఇండియా కూటమి-08
ఢిల్లీ : బీజేపీ – 07, ఆప్ – 0, కాంగ్రెస్ – 0
మళ్లీ ఎన్డీఏదే అధికారం..
దక్షిణాదిన కూడా బీజేపీ ఆశించిన సీట్ల కంటే తక్కువగా వస్తాయని సర్వే తేల్చింది. కర్ణాటక అసెంబీ‍్ల ఎన్నిల్లో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు వస్తాయని తెలిపింది. 28 లోక్‌సభ సీట్లలో 24 ఇండియా కూటమికే వస్తాయని తేల్చింది. తెలంగాణలోనూ 17 స్థానాలకు 10 స్థానాలు ఇండియా కూటమే గెలుస్తుందని తేల్చింది. కేరళలో 20 స్థానాలకు 20 చోట్ల ఇండియా కూటమి విజయం సాధిస్తుందని తెలిపింది. తమిళనాడులోనూ 39 సీట్లకు ఇండియా కూటమి 39 చోట్ల గెలుస్తుందని, ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని తేల్చింది.