https://oktelugu.com/

Uttar Pradesh : ఉత్తరాదిలో చరణ్ సింగ్ పార్టీ ఇండీ కూటమి నుంచి బయటకు

ఉత్తరాదిలో చరణ్ సింగ్ పార్టీ ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చిన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 8, 2024 / 06:15 PM IST

    Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అక్కడ ఎవరు గెలిస్తే కేంద్రంలో వారిదే అధికారం..మరి 80 ఎంపీ సీట్లలో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా మారింది. సర్వేలన్నీ కూడా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. గంప గుత్తగా ఈసారి 75కి తగ్గకుండా బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయి.

    మిగతా అన్ని చోట్ల కంటే కూడా హిందువులకు కర్మ భూమి ‘ఉత్తరప్రదేశ్’.అనాధి నుంచి యూపీ హిందుత్వంతో నిండిపోయింది. కృష్ణుడు గుజరాత్ లో పుట్టినా ఆయన కర్మ భూమి ఉత్తరప్రదేశ్ లోని ముధురనే.. శ్రీరాముడు పరిపాలన చేసింది అయోధ్యనే.. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శివుడి ప్రీతిపాత్రమైన ప్రదేశం కాశీ ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఈ ఆధ్యాత్మిక కనెక్షన్ యూపీ వాసులకు ఎక్కువ.

    ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో శ్రీరామ మందిరం నెలకొల్పడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఓట్ల రూపంలో ఖచ్చితంగా ప్రభావం చూపడం ఖాయం. సమాజ్ వాదీ పార్టీ కూడా రామమందిరం కట్టినందుకు మోడీని, యోగిని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానించారు.

    ఉత్తరాదిలో చరణ్ సింగ్ పార్టీ ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చిన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.