వల్లభనేని వంశీకి చెక్ పెట్టేందుకు ఏకమైన ప్రత్యర్థులు

రాజకీయాల్లో వలసలు కామన్‌. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలోకి దూకుతాడో ఎవరం అంచనా వేయలేం. పార్టీలో ప్రాధాన్యం లేదనో.. టికెట్‌ ఇవ్వడం లేదనో.. ఇతర నేతలతో పొసగడం లేదనో.. ఏదో ఒక కారణంతో పార్టీలు మారుతూనే ఉంటారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వైసీపీ నేతలు ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ స్థాయిలో చంద్రబాబు కూడా వలసలను ప్రోత్సహించారు కూడా. అయితే.. ఏపీలో ఇప్పుడు జగన్‌ రాజ్యం నడుస్తోంది. దీంతో ప్రతిపక్ష టీడీపీని […]

Written By: NARESH, Updated On : October 31, 2020 8:04 pm
Follow us on

రాజకీయాల్లో వలసలు కామన్‌. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలోకి దూకుతాడో ఎవరం అంచనా వేయలేం. పార్టీలో ప్రాధాన్యం లేదనో.. టికెట్‌ ఇవ్వడం లేదనో.. ఇతర నేతలతో పొసగడం లేదనో.. ఏదో ఒక కారణంతో పార్టీలు మారుతూనే ఉంటారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వైసీపీ నేతలు ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ స్థాయిలో చంద్రబాబు కూడా వలసలను ప్రోత్సహించారు కూడా. అయితే.. ఏపీలో ఇప్పుడు జగన్‌ రాజ్యం నడుస్తోంది. దీంతో ప్రతిపక్ష టీడీపీని వీడి ఇప్పటికే చాలా క్యాడర్‌‌ వైసీపీలోకి దూకేసింది.

కొద్దిరోజులుగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సెగలు పొగలు రగులుకుంటున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి రావడంతో అప్పటికే వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావ్ సహా మరో నేత దుట్టా రాంచంద్రరావు , మిగతా వైసీపీ నేతలు వంశీని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే మూడు గ్రూపుల తాజాగా కలిసి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా భేటి కావడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది.

గన్నవరం నియోజకవర్గంలో తాజాగా ప్రత్యర్థులంతా ఏకమయ్యారు. ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా వైసీపీ పొలిటికల్‌ సలహా కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే బాలవర్దనరావు, యార్లగడ్డ వెంకటరావు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. తాజాగా ఈ ముగ్గురూ మరోసారి రహస్యంగా భేటీ కావడం సంచలనమైంది. దుట్టా నివాసంలో ఈ భేటి జరిగింది. గంటపాటు ముగ్గురు వంశీకి వ్యతిరేకంగా సమాలోచనలు జరిపారు. వైసీపీ కార్యకర్త ఇంట్లో వివాహానికి హాజరయ్య సందర్భంలో తామంతా కలిశామని చెబుతున్నా అసలు టార్గెట్ వంశీనే అని చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కోసం కష్టపడ్డ నేతలనే నిలపాలని.. వాళ్లనే గెలిపించుకుందామని ఈ ముగ్గురు నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వంశీని రాబోయే స్థానిక ఎన్నికల నాటికి విజయవాడ పంపించాలని చూస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే వంశీ టీడీపీ తనతోపాటు టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని వైసీపీని నమ్ముకొని ఉన్న క్షేత్రస్థాయి నేతలు రగిలిపోతున్నారట.. వైసీపీ నేతలు దుట్టా, బాలవర్ధనరావు, యార్లగడ్డలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. వైసీపీ తరుఫున గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావును నిలపాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు తర్వాత జగన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టాలని నిర్ణయించాట.. పార్టీ సీనియర్ నేత దుట్టా రాంచంద్రరావును ఎమ్మెల్సీగా పంపి.. యార్లగడ్డను వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా చేయాలని పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మరి ఇదంతా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.