తెలంగాణలో తనకు సురక్షితమైన జిల్లాగా ఖమ్మంను షర్మిల ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఆమె పాలూరు నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధమైంది. ఇక ఖమ్మం నుంచి తొలి సభను నిర్వహించి ఆ జిల్లా నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తోంది.
ఇప్పుడు అదే జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. త్వరలోనే జరిగే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ నాయకులతో ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కీలకంగా మారుతున్నారు. వైఎస్ఆర్ బర్త్ డే సందర్భంగా పార్టీని ప్రకటించేందుకు షర్మిల రెడీ అవుతున్నారు. అధికార వైసీపీని దూకుడుగా ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో షర్మిల పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో పోటీచేయాలని ఇప్పటికే కొందరు ఆమెతో చెప్పినట్లు సమాచారం.
ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తే తమ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని.. ముందుగానే బరిలోకి దిగడం వల్ల వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకోవచ్చని షర్మిల భావిస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మంలో బరిలోకి దిగాలని సత్తా చాటాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.