https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్బీఐలో భారీ వేతనంతో జాబ్స్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 148 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్, అడ్వైజర్, డేటా అనలిస్ట్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 15, 2021 / 08:29 AM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 148 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్, అడ్వైజర్, డేటా అనలిస్ట్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వెబ్ సైట్ ద్వారానే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 13వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే 3వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం మే 23వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 23వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.

    విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, వరంగల్‌, హైదరాబాద్‌ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది.