కాగా నేడు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త రెవిన్యూ యాక్ట్ పై చర్చను ప్రారంభించారు. రెవిన్యూ చట్టం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ యాక్ట్ రావడంలో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీని వల్ల రైతులు, సామాన్యులు ఎవరూ రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు.
Also Read: రగిలిన ‘విమోచనం’.. కేసీఆర్ ఎందుకు నిర్వహించరు?
అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు పలు ప్రశ్నలను సభలో లెవనెత్తారు. భూప్రక్షాళన సమయంలో రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదయ్యాయని.. రిజిష్ట్రేషన్లను తహసీల్దార్ల వద్దే జరగాలని.. మ్యూటేషన్లలో ప్రజలు ఇబ్బందులు వస్తున్నాయని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సభ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా సమగ్ర భూసర్వే ఎప్పుడు చేస్తారో స్పష్టం చేశాలని సీఎంను కోరారు. ధరణి పోర్టల్ హ్యక్ అయితే ఏంటని.. ధరణి పోర్టల్ అన్ని సమస్యలకు పరిష్కరం కాదని.. కొత్త సమస్యలు వస్తాయని తెలిపారు. అసైన్డ్ భూముల సమస్యలను ఎలా పరిష్కరో చెప్పాలన్నారు. ప్రభుత్వం పేదలకు పంచిన భూములను స్వాధీనం చేసుకుంటుందా? అని ప్రశ్నించారు. సివిల్ కోర్టుల సమస్యను ఎలా పరిష్కరిస్తారో వివరించాలని కోరారు. సమగ్ర సెటిల్ మెంట్ సర్వే పూర్తయ్యే వరకు ఇప్పుడున్న విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇందుకు సీఎం కేసీఆర్ స్పందిస్తూ ప్రస్తుత వీఆర్వో వ్యవస్థ పోయిందని.. దానిని కొనసాగించాలని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత వీఆర్వో వ్యవస్థ లోపభూయిష్టంగా మారడంతోనే విశాల దృక్పథంతోనే కొత్త రెవిన్యూ యాక్ట్ తీసుకు రాబోతున్నట్లు తెలిపారు.
Also Read: జర్నలిస్టులు.. ఒంటరిగా మిగిలిపోతున్నారు.!
ఇక ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ కొత్త రెవిన్యూ యాక్ట్ ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే భూములకు సంబంధించిన ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆక్రమణలు మాత్రం ఆగడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలోని భూములకు, రికార్డుల్లోని భూములకు చాలా తేడాలున్నాయని తెలిపారు. వక్ఫ్, దర్గా భూములు కూడా చాలా చోట్ల ఆక్రమణలకు గురైనట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. కొత్త రెవిన్యూ యాక్ట్ వల్ల ప్రజలు మంచి జరుగుతుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.