https://oktelugu.com/

జర్నలిస్టులు.. ఒంటరిగా మిగిలిపోతున్నారు.!

సమాజంలో నాలుగో స్తంభం  జర్నలిజం. ప్రజాస్వామ్యం, చట్టం, పోలీసు వ్యవస్థల తర్వాత మీడియాకు దేశంలో అంతటి ప్రాముఖ్యత ఉంది. మీడియా ఉంటే అందరినీ ఉచ్చపోయించవచ్చు అని అందరూ భావిస్తారు. బయట ఉన్న వారికి  మీడియా వాళ్ల గురించి అలాంటి ఫీలింగే ఉంటుంది. పోలీసులు భయపడుతారు. మీడియా వాళ్లతో ఎందుకు గొడవ అనుకుంటారు. కానీ మీడియాలో ఉండే వారికే ఆ కష్టాలు తెలుసు. మీడియా మిత్రులందరూ చెప్పేది ఒకటే.. ఇప్పుడున్న మీడియాలోకి ఎవరూ రావద్దని.. కరోనా కాటుతో అన్నింటికంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 04:19 PM IST

    Journalists

    Follow us on

    సమాజంలో నాలుగో స్తంభం  జర్నలిజం. ప్రజాస్వామ్యం, చట్టం, పోలీసు వ్యవస్థల తర్వాత మీడియాకు దేశంలో అంతటి ప్రాముఖ్యత ఉంది. మీడియా ఉంటే అందరినీ ఉచ్చపోయించవచ్చు అని అందరూ భావిస్తారు. బయట ఉన్న వారికి  మీడియా వాళ్ల గురించి అలాంటి ఫీలింగే ఉంటుంది. పోలీసులు భయపడుతారు. మీడియా వాళ్లతో ఎందుకు గొడవ అనుకుంటారు. కానీ మీడియాలో ఉండే వారికే ఆ కష్టాలు తెలుసు. మీడియా మిత్రులందరూ చెప్పేది ఒకటే.. ఇప్పుడున్న మీడియాలోకి ఎవరూ రావద్దని.. కరోనా కాటుతో అన్నింటికంటే తీవ్రంగా దెబ్బతింది మీడియానే. వేల మంది రోడ్డున పడ్డారు. వేరే ఉద్యోగాలకు పోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే మీడియా డొల్లతనం ఆ పనిచేసిన వారికే తెలుస్తుంది.

     

    Also Read: రెవెన్యూ రచ్చ.. అసెంబ్లీని కుదిపేసింది!

    ఎన్నో ఆశలు, ఎన్నో కాంక్షలు.. జర్నలిస్టుగా దున్నేద్దాం అని చాలామంది యువకెరటాలు మీడియా రంగంలోకి వస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని జాబ్ లో జాయిన్ అవుతారు.. పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యోగాల్లో అతుక్కుపోతారు. పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి. జర్నలిస్టుల జాబులన్నీ రాత్రి ఉంటాయి. పత్రికలైతే సాయంత్రం 5 నుంచి రాత్రి 1 గంట వరకు.. న్యూస్ చానెల్స్ అయితే మూడు షిఫ్టులు రాత్రి, పగలు ఉంటాయి. ఇలా ప్రకృతి విరుద్ధమైన ఈ ఉద్యోగాలతో జర్నలిస్టులు తమ జీవితాలను కోల్పోతున్నారు. రాత్రిళ్లు జాబ్ చేస్తుండడంతో ఇంటికొచ్చాక  అలిసిపోయి సరిగ్గా సంసారం చేయలేకపోతున్నారు. దీంతో వారి భార్యలు.. భర్త నిస్సహాయతను ఆడిపోసుకుంటున్నారు. 
     
    ఇది అంతిమంగా గొడవలకు దారితీస్తోంది. అర్థం చేసుకునే భార్యలు దొరికితే పర్లేదు. వారి జీవితాలు సాఫీగా సాగుతున్నాయి.కానీ పెద్ద కుటుంబాల్లో ఉన్న వారు మాత్రం ఈ రాత్రి డ్యూటీలతో సంసార సుఖాలకు దూరం అవుతున్నారు. పగలు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండడం.. రాత్రిళ్లు అలిసిపోయి రావడంతో భార్యకు సమయాన్ని కేటాయించలేక వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు..

    Also Read: రగిలిన ‘విమోచనం’.. కేసీఆర్ ఎందుకు నిర్వహించరు?

    తాజాగా ఓ సర్వే జర్నలిస్టుల జీవితాలు ఎంత దుర్లభమో చాటిచెప్పాయి. దేశవ్యాప్తంగా అత్యధిక విడాకులు తీసుకుంటున్న వారిలో మీడియాలు, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులదే సింహభాగమని తేల్చింది. వారు వ్యక్తిగత జీవితాలను కోల్పోతున్నారనే వాస్తవాన్ని కళ్లకు కట్టింది. జర్నలిస్టులను అర్థం చేసుకునే అమ్మాయిలు లేక.. అర్థం చేసుకున్నా వారి ఒత్తిడి జీవితంలో ఇమడలేక చాలామంది విడాకులకు సిద్ధపడుతున్నారని తేల్చింది. దీంతో జర్నలిస్టులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని సంతృప్తి పరచలేక నలిగిపోతున్నారు.  అందుకే జర్నలిజంలోకి భవిష్యత్ తరాలను రావాలంటేనే వద్దంటున్నారు. ఇక యువత కూడా ఈ వృత్తిని అంతగా ఇష్టపడడం లేదు. కొద్దిరోజులైతే జర్నలిస్టులు అనేవాళ్లు తక్కువై పోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 
     
    -ఎన్నం