https://oktelugu.com/

900 ఏళ్లుగా ఎవ్వరూ ఎక్కని ఆ దేవతల పర్వతం.. ఎక్కితే ప్రాణాలు ఖతం..

900 ఏళ్లుగా ఆ పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కలేదు. ఎక్కడానికి ప్రయత్నించిన వారు మధ్యలోనే అదృశ్యమయ్యారు. ఆ పర్వత విశేషాలను చూడడానికి వెళ్లిన వారు సన్యాసులుగా మారిపోతున్నారట.. కొందరు చైనీయులు ధైర్యం చేసి పర్వత ఎక్కగా అదృశ్యమైపోయారు. వారి దేహాలు కూడా ఇప్పటికీ లభ్యం కాలేదట. అందుకే చైనా ప్రభుత్వం ఇప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించింది. ఏంటా పర్వతం.. ఎక్కుడుంది. అది..? ఆ విశేషాలు తెలుసుకుందాం.. Also Read: యుద్ధానికి స్టాప్: భారత్-చైనా కీలక నిర్ణయం సముద్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 04:27 PM IST

    Mount khailas

    Follow us on

    900 ఏళ్లుగా ఆ పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కలేదు. ఎక్కడానికి ప్రయత్నించిన వారు మధ్యలోనే అదృశ్యమయ్యారు. ఆ పర్వత విశేషాలను చూడడానికి వెళ్లిన వారు సన్యాసులుగా మారిపోతున్నారట.. కొందరు చైనీయులు ధైర్యం చేసి పర్వత ఎక్కగా అదృశ్యమైపోయారు. వారి దేహాలు కూడా ఇప్పటికీ లభ్యం కాలేదట. అందుకే చైనా ప్రభుత్వం ఇప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించింది. ఏంటా పర్వతం.. ఎక్కుడుంది. అది..? ఆ విశేషాలు తెలుసుకుందాం..

    Also Read: యుద్ధానికి స్టాప్: భారత్-చైనా కీలక నిర్ణయం

    సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఆ పర్వతం ఉంది. అదే కైలాస పర్వతం (మౌంట్ కైలాస్). ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారని హిందువులు నమ్ముతారు.. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి (గంగానదికి ఉపనది) మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
     
    మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు ఇసమంతైనా అర్థంకాని రహస్యాలు ఎన్నోఈ పర్వతంపై దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం, వినాయక, కుమారస్వామి, నంది ల దర్శనం కలుగుతుంది.
     
    కైలాస పర్వత పాదపీఠంలో నెలకొని ఉన్న మానస సరోవరం మరో అపురూపం.అత్యద్భుతం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. బ్రహ్మీ ముహుర్తంలో అంటే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. ఈ ముహూర్తంలో కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.

    Also Read: అమెరికాలో భారతీయ ఓటర్ల మద్దతు ట్రంప్‌కేనా..?

    ఇన్ని ప్రత్యేకతలున్నా ఈ పర్వతాన్ని అధిరోహించడం ఎవ్వరి తరం కాలేదంటూ నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజం.. ఎక్కిన వారు ప్రాణాలతో తిరిగిరాలేదు.  ఈ పర్వత శిఖరం చివరి అంచును గడిచిన 900 ఏళ్లుగా ఎవ్వరూ తాకలేదంటే పర్వతం మహత్య్మాన్ని అర్థం చేసుకోవచ్చు..