చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రపంచంలోని అన్నిదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే, భారత్, పాకిస్థాన్ తదితర దేశాల్లో కరోనా పంజా విసురుతోంది. తాజాగా భారత్ 3లక్షల కరోనా కేసుల మార్కును దాటేసింది. భారత్-చైనాలతో సరిహద్దును పంచుకుంటున్న పాకిస్థాన్ లో కరోనా కేసులు రోజుకు విజృంభిస్తుంది. దీంతో ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనాతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జాఫర్ సర్ఫరాజ్, రియాజ్ షేక్ ఇప్పటికే మృత్యువాత పడిన సంగతి తెల్సిందే.
తాజాగా మరో క్రికెటర్ కరోనా బారినపడ్డారు. పాకిస్థాన్ కెప్టెన్, మాజీ కెప్టెన్ గా ఆ జట్టుకు సేవలందించిన అఫ్రిది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్రిదినే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. గత గురువారం నుంచి ఆరోగ్యం బాగోలేకపోవడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని ఆఫ్రిది తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు.
ఆఫిద్రి క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 16ఏళ్ల వయస్సులోనే ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 27 టెస్టులు, 398వన్డేలు, 99టీ20 మ్యాచ్‌లాడాడు. 2011వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుని కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్రికెట్లో పలు రికార్డులు ఆఫ్రిది పేరిట ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో తనవంతు సహకారం అందిస్తుంటాడు. ఆఫ్రిది కరోనా బారినపడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
