https://oktelugu.com/

రాజమౌళి కోసం సీన్స్ రాసిన టాలెంటెడ్ డైరెక్టర్ !

విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం షూటింగ్ కి రెడీ అవుతొంది. కాగా ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అయితే సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా […]

Written By:
  • admin
  • , Updated On : June 13, 2020 / 06:37 PM IST
    Follow us on


    విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం షూటింగ్ కి రెడీ అవుతొంది. కాగా ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అయితే సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.

    కాగా సాయిమాధవ్ చేత మూడు వెర్షన్స్ రాపించారట. అయినా కొన్ని సన్నివేశాల్లో రాజమౌళి డైలాగ్స్ విషయంలో సంతృప్తి పడలేదని అందుకే తనకు మాటల సాయం అందించే టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టాతో కూడా ఆ సన్నివేశాల వరకూ మళ్ళీ రాపించాడని తెలుస్తోంది. దేవ కట్టా ‘బాహుబలి 2’లో కూడా కీలక సన్నివేశాలకు డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కి కూడా కీలక సీన్స్ వరికి రాశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ కఠినమైన కసరత్తులు కూడా చేశాడు.

    కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రీయా, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2021 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.