https://oktelugu.com/

ఏడోసారి చర్చలు.. ఇవైనా సక్సెస్‌ అయ్యేనా..?

ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు వదలని వాన.. అయినా పట్టువదలని విక్రమార్కల్లా రైతులు మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వీరితో ఆరు దఫాల్లో చర్చలు సైతం నిర్వహించింది. కానీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు.. రోజురోజుకూ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ‘మా డిమాండ్లు ఏం మారలేదు. చట్టాలను రద్దు చేయాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 4, 2021 / 03:32 PM IST
    Follow us on


    ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు వదలని వాన.. అయినా పట్టువదలని విక్రమార్కల్లా రైతులు మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వీరితో ఆరు దఫాల్లో చర్చలు సైతం నిర్వహించింది. కానీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు.. రోజురోజుకూ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ‘మా డిమాండ్లు ఏం మారలేదు. చట్టాలను రద్దు చేయాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి’ అని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 6, 26 తేదీల్లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. అయితే.. కేంద్రం నేడు మరోసారి రైతు సంఘాలతో చర్చలకు దిగింది.

    Also Read: అసద్‌కు డీఎంకే పిలుపు..: అందుకేనట

    మరోవైపు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. దేశ రాజధానిలో చలిగాలులు వీస్తున్నా.. వర్షం తడిపేస్తున్నా అన్నదాతలు వెనక్కి తగ్గట్లేదు. తీవ్రమైన చలిలోనూ ‘జై జవాన్‌–జై కిసాన్‌’ అంటూ నినాదాలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు. మరోవైపు.. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఇంకా మూసివేత కొనసాగుతూనే ఉంది. ఘాజీపూర్‌‌, చిల్లా రహదారులను పాక్షికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాల్సి వస్తోంది.

    Also Read: ఓ వైపు చలి.. దానికితోడు వర్షం.. అయినా పట్టువదలని రైతులు

    రైతులు, కేంద్రం మధ్య ఇప్పటికే జనవరి 1న ఆరో విడత చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో కేవలం రెండు అంశాలపైనే కేంద్ర మంత్రుల బృందం.. రైతు సంఘాల నేతలు ఏకాభిప్రాయానికి రాగలిగారు. కీలక చట్టాల రద్దు.. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మరి ఈ రోజు జరుపుతున్న చర్చల్లో అయినా కొలిక్కి వస్తాయో లేదో చూడాలి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్