కోవాగ్జిన్ టీకా వేయించుకున్న టీడీపీ ఎమ్మెల్యే

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు రెండో డోస్ వేయించుకున్నారు. ఆయనతో పాటు అతని సతీమణి గద్దె అనురాధ కూడా టీకా వేయించుకున్నారు. ఇదివరకే మొదటి డోస్ వేయించుకున్న రామ్మోహన్ రావు […]

Written By: Suresh, Updated On : January 4, 2021 3:22 pm

tdp

Follow us on

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు రెండో డోస్ వేయించుకున్నారు. ఆయనతో పాటు అతని సతీమణి గద్దె అనురాధ కూడా టీకా వేయించుకున్నారు. ఇదివరకే మొదటి డోస్ వేయించుకున్న రామ్మోహన్ రావు తాజాగా రెండో డోస్ వేయించుకున్నారు. విజయవాడలోని అమరావతి రోడ్డులోని జ్వరాల ఆసుపత్రిలో వ్యాక్సినేష్ జరుగుతోంది. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు దంపతులు ఈ ఆసుపత్రిలో కోవాగ్జిన్ టీకా వేయించుకున్నారు.