అమెరికాలో తీవ్రమైన అల్లర్లు.. ట్రంప్ మద్దతుదారుల దాడులు..

అమెరికాలో రిపబ్లికన్ల ఓటమిని అటు అధ్యక్షుడు, అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. కోర్టు కెళతాను.. ఇదంతా అక్రమమని ఆరోపిస్తున్నాడు. ఇటు ఆయన మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ డెమొక్రటిక్ మద్దతుదారులు చేస్తున్న సంబరాలపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలే కాల్పుల్లో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. తాజాగా అమెరికాలో తీవ్రమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలు ఆయన అనుచరులు రెచ్చిపోతుండడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు ట్రంప్ వరుస వివాదాస్పద ప్రకటనలతో ఆయన […]

Written By: NARESH, Updated On : November 8, 2020 7:36 pm
Follow us on

అమెరికాలో రిపబ్లికన్ల ఓటమిని అటు అధ్యక్షుడు, అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. కోర్టు కెళతాను.. ఇదంతా అక్రమమని ఆరోపిస్తున్నాడు. ఇటు ఆయన మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ డెమొక్రటిక్ మద్దతుదారులు చేస్తున్న సంబరాలపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలే కాల్పుల్లో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. తాజాగా అమెరికాలో తీవ్రమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలు ఆయన అనుచరులు రెచ్చిపోతుండడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

ట్రంప్ వరుస వివాదాస్పద ప్రకటనలతో ఆయన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. బేస్ బాల్ బ్యాట్లు, పెప్పర్ స్ప్రేలు చల్లి కార్లను ధ్వంసం చేస్తున్నారు.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

Also Read: జోబైడెన్ రాకతో హెచ్1బీ ఆంక్షలు రద్దు అవుతాయా?

జోబైడెన్ విజయం ఖరారైన తర్వాత కూడా ట్రంప్ ఈ తరహా ప్రకటనలు చేయడంతో రిపబ్లికన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అప్పటికే రోడ్లపైన చేరి సంబురాలు చేసుకుంటోన్న బైడెన్ మద్దతుదారులపై ట్రంప్ అనుకూల గ్యాంగులు దాడులకు పాల్పడ్డాయి. వాషింగ్టన్, న్యూయార్క్, మిచిగన్, ఓరెగాన్ తదితర రాష్ట్రాల్లో ట్రంప్ వర్గం దాడులకు పాల్పడుతోన్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

Also Read: చెత్త రికార్డు: రెండోసారి గెలవని అధ్యక్షుడిగా ట్రంప్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను ఆయా రాష్ట్రాలే ప్రతీసారి జరుపుతాయి. రాష్ట్రాలే సుప్రీం. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ పాత్ర నామమాత్రంగా ఉండటం, ఈసారి సగానికిపైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్ రూపంలో రావడం, వాటిని ఎప్పటి వరకు స్వీకరించాలి, ఎలా లెక్కబెట్టాలనే దానిపై రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉండటంతో ఫలితాల వెల్లడిలో గందరగోళం ఏర్పడింది. ఎలక్షన్ డే(మంగళవారం) ముగిసి ఐదు రోజులవుతున్నా ఇంకా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిండం కుట్రే అని, కౌంటింగ్ కేంద్రాల్లోకి రిపబ్లికన్ పరిశీలకులను అనుమతించడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. తాజాగా తాను 71 మిలియన్ (7 కోట్ల) లీగల్ ఓట్లతో గెలుపొందానని ఆయన ప్రకటించుకున్నారు.