గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యాపారాలు చేయాలని కార్యకర్తలను ఒత్తిడి చేసినట్టు ఉన్న ఒక ఆడియోను తెలుగు నంబర్1 న్యూస్ చానెల్ బయటపెట్టి సంచలనం సృష్టించింది. తాడికొండ నియోజకవర్గంలో ఇసుక, లిక్కర్, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎమ్మెల్యే శ్రీదేవి సపోర్టుగా నిలబడుతూ కార్యకర్తలను చేయాలని ఉన్న ఆడియోను సదురు చానెల్ బయటపెట్టింది. స్వయంగా ఎమ్మెల్యే శ్రీదేవి కార్యకర్తలతో ఇల్లీగల్ బిజినెస్ లపై మాట్లాడిన ఆడియో టేపులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె సొంత పార్టీ కార్యకర్తలే దీన్ని విడుదల చేయడం సంచలనమయ్యాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఇప్పటిదాకా ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులుగా ఉన్న సందీప్, సురేష్ లే ఈ ఆడియో టేప్ ను బయటపెట్టడం విశేషం. వారిద్దరిపై ఇటీవల పేకాట నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే శ్రీదేవి దూరంగా పెట్టినట్టు చానెల్ పేర్కొంది. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి స్వయంగా పేకాట క్లబ్ లు నిర్వహించాలని తమను కోరిందని.. ఈ మేరకు కార్యకర్తలతో మాట్లాడిన ఆడియోను తాజాగా వారు బయటపెట్టి సంచలనం రేపారు. ఇప్పుడీ ఆడియో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఆడియోను బయటపెట్టి కార్యకర్తలు ఇప్పుడు సంచలనం రేపారు. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడితో మాట్లాడిన ఆడియో టేపు బయటపడడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు.
Also Read: చంద్రబాబుకు మరో షాక్.. టీడీపీకి మాజీ మంత్రి గుడ్ బై
ఈ వివాదంపై ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు. కొందరు తనపై కుట్రపన్ని ఈ ఆడియో టేపులు సృష్టించారని ఆమె ఆరోపించారు. వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆడియో టేపులంటూ జరుగుతున్న ప్రచారం తప్పు అని.. తన గొంతుతో తప్పుడు ఆడియోలు సృష్టించారని ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాకు వివరణ ఇచ్చారు. అంతేకాదు తనకు సురేష్, సందీప్ లతో ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాతో తెలిపారు.
Also Read: హవ్వా.. బాబు నియోజకవర్గానికి జగన్ నీళ్లివ్వాలంట
ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవిపై ఆ నియోజకవర్గ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా సందీప్, సురేష్ అనే ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది.