సుశాంత్-రియా కలిసే డ్రగ్స్ వ్యాపారం చేశారా?

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రోజుకో షాకింగ్ న్యూస్ బయటపడుతోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా.. బాలీవుడ్లోని చీకటీ కోణాలు.. డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డ్రగ్ కేసులో రియా చక్రవర్తి పూర్తిగా ఇరుక్కుపోతోంది. ఇప్పటికే పోలీసులు మూడురోజులపాటు ఆమెను విచారించి నిన్న అరెస్టు చేశారు. Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. ! సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియాకు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో సీబీఐ, నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును […]

Written By: NARESH, Updated On : September 10, 2020 8:09 pm
Follow us on

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రోజుకో షాకింగ్ న్యూస్ బయటపడుతోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా.. బాలీవుడ్లోని చీకటీ కోణాలు.. డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డ్రగ్ కేసులో రియా చక్రవర్తి పూర్తిగా ఇరుక్కుపోతోంది. ఇప్పటికే పోలీసులు మూడురోజులపాటు ఆమెను విచారించి నిన్న అరెస్టు చేశారు.

Also Read: పూజా హెగ్డేతో ప్రభాస్ కూడా సిద్ధం.. !

సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియాకు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో సీబీఐ, నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. డ్రగ్ కేసుతో సంబంధాలున్న బాలీవుడ్లోని పలువురి స్టార్ల పేర్లను రియా చక్రవర్తి విచారణలో వెల్లడించింది. సుమారుగా 26మంది సీని పెద్దలకు డ్రగ్స్ తో లింకులు ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం మొదలైంది. ఎవరెప్పుడు అరెస్టు అవుతారోననే ఆందోళన చెందుతున్నారు.

ఈ కేసులో రియా చక్రవర్తి మరో షాకింగ్ న్యూస్ చెప్పడంతో పోలీసులే అవాక్కయినట్లు తెలుస్తోంది. తాను ‘డ్రగ్ సిండికేట్’లో కీలకమైన సభ్యురాలినని.. సుశాంత్ సింగ్ తోపాటు మాదక ద్రవ్యాల సేకరణ కోసం ఫైనాన్స్ నిర్వహణకు డబ్బులు ఖర్చు చేసినట్లు రియానే స్వయంగా ఒప్పుకుందట. ఈ విషయాలను ఎన్సీబీ పోలీసులే చెబుతుండటంతో సుశాంత్ సింగ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రియా చక్రవర్తిని పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఆమెకు 14రోజుల జ్యూడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.

అంతేకాకుండా డ్రగ్ సిండికేట్ సభ్యులైన దీపేశ్ సావంత్.. షోయిక్ చక్రవర్తి.. మిరండాలకు సైతం రియా చక్రవర్తి సలహాలు, సూచనలు చేసిదట. డ్రగ్ ఔషధాల కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక సమస్యలను కూడా సుశాంత్- రియా చక్రవర్తి కలిసి చాకచక్యంగా పరిష్కరించుకునే వారని డ్రగ్ సిండికేట్ సభ్యులు దీపేశ్ సావంత్, రియా సోదరుడు షోయిక్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

Also Read: శివసేన ప్రతీకారం: కంగన ముంబై ఆఫీస్ కూల్చివేత

డ్రగ్ పంపిణీని సులభంగా పంపిణీ చేసేందుకు డ్రగ్ వ్యాపారి బాసిత్, కైజన్లు తమను ఉపయోగించుకునే వారని పోలీసులు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రతీ డీల్ రియా చక్రవర్తి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పడంతో ఎన్సీబీ పోలీసులు సైతం అవాక్కయినట్లు తెలుస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఇంకెన్నీ షాకింగ్ నిజాలు వెలుగులో రానున్నాయో వేచి చూడాల్సిందే..!