నాయకత్వ మార్పు సీనియర్లకు ఇష్టం లేదా..: అందుకే ఈ సైలెంటా..!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల దూకుడుకు తోడు.. మరోవైపు అధికార పక్షంలో నాయకత్వ మార్పుపై విస్తృత చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో కేసీఆర్‌‌ సీఎం బాధ్యతల నుంచి తప్పుకొని తన తనయుడు కేటీఆర్‌‌ను సీఎం సీట్లో కూర్చోబెడుతారనే ప్రచారం ఈ మధ్య మరింత ఊపందుకుంది. అందుకే.. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కేటీఆర్‌‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. Also Read: సంచలనం: కాపుల కోసం ముద్రగడ మరో కొత్త రాజకీయ పార్టీ కేటీఆర్‌‌ […]

Written By: Srinivas, Updated On : January 22, 2021 1:46 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల దూకుడుకు తోడు.. మరోవైపు అధికార పక్షంలో నాయకత్వ మార్పుపై విస్తృత చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో కేసీఆర్‌‌ సీఎం బాధ్యతల నుంచి తప్పుకొని తన తనయుడు కేటీఆర్‌‌ను సీఎం సీట్లో కూర్చోబెడుతారనే ప్రచారం ఈ మధ్య మరింత ఊపందుకుంది. అందుకే.. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కేటీఆర్‌‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: సంచలనం: కాపుల కోసం ముద్రగడ మరో కొత్త రాజకీయ పార్టీ

కేటీఆర్‌‌ గుడ్ లుక్స్‌లో పడేందుకు ఇప్పటివరకూ పెద్దగా ప్రాధాన్య పోస్టులు పొందని టీఆర్ఎస్ నేతలు కూడా ఆరాటపడుతున్నారు. అలా చేస్తేనైనా మంత్రి పదవి దక్కుతుందేమోనని ఉబలాటపడుతున్నారు. అయితే.. కొంత మంది సైలెంట్‌గా ఉంటున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిపై చాలా మంది సీనియర్లు ఇంకా తమ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఈటల లాంటి ఒకరిద్దరు తప్ప అనేక మంది తమ అభిప్రాయాల్ని బహిరంగంగా చెప్పాల్సి ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన బీటీ బ్యాచ్‌గా పేర్కొనే బంగారు తెలంగాణ బ్యాచ్ మాత్రం.. కేటీఆర్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది.

ఉద్యమంలో పీక్స్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌‌ వెంట నడిచిన వారు ఇంకా పూర్తస్థాయిలో బయటకు రాలేదు. అటు రాష్ట్ర రాజకీయాల్లో.. ఇటు పార్టీలో వారంతా సీనియర్లు. కేసీఆర్‌తో కలిసి పనిచేసిన వారు. వారంతా.. మనస్ఫూర్తిగా కేటీఆర్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ముఖ్యంగా ఈ విషయంపై హరీష్ రావు ఇంత వరకూ స్పందించలేదు. ఆయన స్పందన కోసం టీఆర్ఎస్‌లోనే కాదు.. ఇతర పార్టీల నేతలూ ఎదురుచూస్తున్నారు. మామూలుగా అయితే ఉద్యమ కాలం నుంచి అధికారంలోకి వచ్చే వరకూ వెన్నుముకగా నిలిచిన నేత హరీష్ రావు. ఆయనకు పార్టీలో ఓ ప్రత్యేకమైన మద్దతుదారులైన వర్గం ఉంది. వారంతా ప్రస్తుత పరిస్థితుల కారణంగా బయటపడలేకపోవచ్చు కానీ.. సందర్భం వస్తే అంతా హరీష్ వైపే చేరుతారని టీఆర్ఎస్‌లో అందరికీ తెలుసు.

Also Read: ఈ సీఎంలు పప్పులో కాలేస్తున్నారా..? : పరిణామాలు అలానే ఉన్నాయి మరి

ఒకవేళ కేటీఆర్‌ కనుక ముఖ్యమంత్రి అయితే.. ఆయన కేబినెట్‌లో హరీష్‌ చేరుతారా.. అందుకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా అనేది కూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అలాగే.. అసలు హరీష్‌కు కేటీఆర్ కేబినెట్‌లో చోటు దక్కకపోతే పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా నడుస్తోంది. హరీష్‌తో పాటు మరికొంత మంది సీనియర్ నేతల స్పందన బయటకు రావాల్సి ఉంది. కేసీఆర్‌‌ అనుకుంటున్నట్లు కేటీఆర్‌‌ను సీఎం చేసేందుకు అందరి నుంచి మద్దతు లభిస్తే మాత్రం కేసీఆర్‌‌కు మరో విజయం దక్కినట్లే.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్