https://oktelugu.com/

ఆ ఏకగ్రీమాలను రద్దు చేసుడేనా..? : ఎస్‌ఈసీ అభిప్రాయం కూడా అదేనట

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్ని ప్రతిష్టంభనకు ఒక్కసారిగా తెరపడింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు సానుకూల తీర్పు నివ్వడంతో.. ఆ తీర్పును ఒక్క అధికార పార్టీ తప్పితే మిగితా పార్టీలన్నీ స్వాగతించాయి. అంతే కాదు పాత ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. గతంలో పార్టీలతో ఎస్‌ఈసీ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని పార్టీలు అదే నిర్ణయంతో ఉన్నాయి. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 22, 2021 / 01:59 PM IST
    Follow us on


    ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్ని ప్రతిష్టంభనకు ఒక్కసారిగా తెరపడింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు సానుకూల తీర్పు నివ్వడంతో.. ఆ తీర్పును ఒక్క అధికార పార్టీ తప్పితే మిగితా పార్టీలన్నీ స్వాగతించాయి. అంతే కాదు పాత ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. గతంలో పార్టీలతో ఎస్‌ఈసీ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని పార్టీలు అదే నిర్ణయంతో ఉన్నాయి.

    Also Read: నాయకత్వ మార్పు సీనియర్లకు ఇష్టం లేదా..: అందుకే ఈ సైలెంటా..!

    అయితే.. ఎస్ఈసీ మాత్రం గతంలో నోటిఫికేషన్ విడుదల కాని పంచాయతీ ఎన్నికలను మాత్రమే రీ షెడ్యూల్ చేసి పెడుతున్నారు. నామినేషన్ల వరకూ వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాయిదా వేసే వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియపై ఎస్‌ఈసీ సంతృప్తిగా లేరనే విషయం కేంద్ర హోంశాఖకు ఆయన రాసిన లేఖ ద్వారానే తేలిపోయింది.

    అధికార పక్షం దాడులు , దౌర్జన్యాల ద్వారా అత్యధికంగా ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏకపక్షంగా పనిచేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు.. మళ్లీ ఆ ఎన్నికల గురించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే .. ఎస్‌ఈసీ ఆ ప్రక్రియ మొత్తం రద్దు చేసి మళ్లీ ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిపితే ఎస్‌ఈసీ అదే నిర్ణయం తీసుకుంటారని.. అందుకే సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి స్టే తీసుకు రావాలని ప్రభుత్వం అనుకుంటోందంటున్నారు.

    Also Read: రాష్ట్రంలో ఎన్నికల వే‘ఢీ’.. ఊపందుకున్న సం‘గ్రామం’

    మరోవైపు.. పంచాయతీ ఎన్నికలు జరిగితే స్వీప్‌ చేస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికలు జరగకుండానే స్వీప్ చేస్తారని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగి ప్రజలు ఓట్లేసి.. స్వీప్ చేయడం వేరు. అసలు ఎన్నికలు జరగకుండా.. పోటీ దారులు లేకుండా చేసుకుని స్వీప్ చేయడం వేరు. ప్రభుత్వం రెండో దానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికలు జరగాలని ప్రజలందరూ ఓట్లేయాలని విపక్షం కోరుకుంటోంది. మొత్తంగా చూస్తే.. ఎన్నికలు నిర్వహించినా క్లీన్‌ స్వీప్‌ చేస్తామంటూ అధికార పక్షంలో నమ్మకం కనిపిస్తున్నా ఎన్నికలు జరిగిన ఫలితాలు వెలువడితే గానీ అసలు విషయం బయటపడదు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్