ఏపీలో పంచాయతీ ఎన్నికలు వేడి రగులుకుంది.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బాబుకు కొనసాగుతున్న పోరు హోరాహోరీకి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ.. హై కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కాగా అంతకుముందే ఎన్నికల సంఘం కేవీయట్ దాఖలు చేసింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాల్సిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తన తీర్పును తప్పని సరిగా.. త్వరగా వెల్లడించాల్సి ఉంటుంది.
Also Read: ఆ విషయంలో జగన్ ఏం చేయబోతున్నారు..?
గత ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఎన్నికల సంఘం విడుదల చేయాల్సి ఉండేది. కానీకరోనా నేపథ్యంలో ఇప్పుడే వద్దని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు నో చెప్పారు. ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బాబుకు సూచించారు. కానీ నిమ్మగడ్డ వినలేదు. అయితే అప్పటినుంచి నిమ్మగడ్డ వర్సెస్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అన్న విధంగా వైరం కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడుకు పక్కా షాడోగా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేశ్ బాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతీసారి ధిక్కరిస్తున్నారు.
ఈ వైరం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని హై కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఎన్నికల సంఘానికి ఎదురు తిరుగుతున్నాయి. హైకోర్టు తీర్పను సవాలు చేస్తూ… ఉద్యోగ సంఘాల నేతలు సుప్రీం కోర్టులో ఫిల్ దాఖలు చేశారు. ఇంకా కరోనా తగ్గలేదు.. ఇప్పుడే.. టీకాల పంపిణీ జరుగుతోంది. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సరికాదని ఉద్యోగ సంఘాల నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Also Read: సంచలనం: కాపుల కోసం ముద్రగడ మరో కొత్త రాజకీయ పార్టీ
గతేడాది కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. వాటి భవితవ్యాన్ని నిర్ణయించాయి. ఎన్నికలకు వ్యతిరేకంగా అక్కడి ఎమ్మెల్యేలు.. సుప్రీంను ఆశ్రయించగా.. ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు వెలువడినా.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాత షెడ్యూల్ ప్రకారమే.. ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తోంది.
ఓ వైపు కరోనా.. మరో వైపు టీకా తీసుకుంటున్న వారియర్స్.. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే… పరిస్థితి అదుపు తప్పుతుందని ప్రజలే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బాబు మాత్రం పంతం వీడడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూనే జగన్ సర్కార్ తో ఢీకొంటున్నారు. మరి ఈ వివాదంలో అంతిమంగా ఏం తేలుతుందనేది వేచిచూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్