జగన్ పై సీనియర్ నేతల గుస్సా..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీనియర్ మంత్రులు అసహనంతో ఉన్నారా..? ఎంతోకాలంగా పార్టీకి పనిచేస్తే తమను పట్టించుకోవడం లేదని చర్చించుకుంటున్నారా..? పార్టీని పట్టుకొని, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన తమను కాదని వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారా..? అని వైసీపీ సీనియర్ నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా పార్టీలోని సీనియర్ నేతలు తమకు ఆశించిన పదవులు దక్కడం లేదని మనోవేదనకు గురవుతున్నారు. వైసీపీ అధికారంలో లేనప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో పని చేసిన […]

Written By: NARESH, Updated On : June 28, 2021 9:17 am
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీనియర్ మంత్రులు అసహనంతో ఉన్నారా..? ఎంతోకాలంగా పార్టీకి పనిచేస్తే తమను పట్టించుకోవడం లేదని చర్చించుకుంటున్నారా..? పార్టీని పట్టుకొని, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన తమను కాదని వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారా..? అని వైసీపీ సీనియర్ నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా పార్టీలోని సీనియర్ నేతలు తమకు ఆశించిన పదవులు దక్కడం లేదని మనోవేదనకు గురవుతున్నారు.

వైసీపీ అధికారంలో లేనప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో పని చేసిన తమకు.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దూరం పెడుతున్నారని అంటున్నారు. పార్టీ గెలుపు కోసం తాము అహర్నిషలు కష్టపడ్డామని, అయితే గత ఎన్నికల్లో టికెట్ దక్కకున్నా నామినేటేడ్ పదవుల కోసం ఎదురుచూశామని, ఇఫ్పుడు వాటిని కూడా ఇతరులకు కట్టబెట్టడం ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు. ఇక తమను కాదని టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

టీడీపీ నుంచి పోతుల సునీత, పండుల రవీంద్రబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారన్నారు. తాజాగా తోట త్రిమూర్తులకు కూడా ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్సీ కేటాయించామన్నారు. అయితే ఇప్పటికైనా తమను గుర్తిస్తే బాగుంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గానికి కూడా నిధులు బాగానే ఇస్తున్నారని అంటున్నారు. వారు అడిగారో లేదో ఇట్టే నిధులు కేటాయిస్తున్నారంటున్నారు.

వైసీపీ నుంచి రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమకు మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇక తమ సిఫారసుకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, కనీసం తమకు అపాంట్మెంట్ దక్కే చాన్ష్ కూడా రావడం లేదని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రికి క్లోజ్ గా ఉన్నవారికే ఆశించిన లాభం ఉంటుందా..? అని అనుకుంటున్నారు. ఇక పదవులు పొందుతున్నవారు అలాంటివారే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.