
దేశంలో నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే బిర్యానీ ఆకు ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. బిర్యానీలో మంచి వాసన కోసం తేజ్ పత్తాను వాడతామనే సంగతి తెలిసిందే. బిర్యానీ లేదా పులావ్ లోని ముఖ్య పదార్థమైన తేజ్ పత్తా ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఈ ఆకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అందువల్ల తరచూ ఈ ఆకును ఉపయోగిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బిర్యానీ ఆకులను కొద్దిగా నీళ్లలో వేసి ఆ నీళ్లు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రపోయే సమయంలో దిండు పక్కనే తువ్వాలు మీద రెండు చుక్కల బే లీఫ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి పడుకుంటే ఉదయాన్నే ఉత్సాహంతో నిద్ర లేస్తారు. బిర్యానీ ఆకు అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బిర్యానీ ఆకు ఎంతగానో సహాయపడుతుంది.
శ్వాసకోశ వ్యవస్థ ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ఇంటర్‌ల్యూకిన్ అనే ప్రోటీన్ ను వ్యాధినిరోధక వ్యవస్థ స్వల్ప పరిమాణాల్లో విడుదల చేయడం వల్ల ఈ ప్రోటీన్ ను తీసుకుంటే ప్రోటీన్ విడుదల తగ్గుతుంది. మధుమేహం నియంత్రణకు బిర్యానీ ఆకు ఎంతగానో తోడపడుతుంది. కొన్ని రకాల కేన్సర్‌ల ముప్పును తగ్గించడంలో బిర్యానీ ఆకు తోడ్పడుతుంది. బిర్యానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడడం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు.
ఒత్తిడిని తొలగించే గుణాలు బిర్యానీ ఆకులో ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడిగా అనిపిస్తే బాగా ఎండిన బిరియానీ ఆకును కాల్చి, వాసన పీలిస్తే మంచిది. . గది తలుపులు మూసి, ఓ గిన్నెలో బిరియానీ ఆకును కాల్చితే మనసు నెమ్మదించి, ఒత్తిడి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.