Unplugged With Subhankar Mishra: ఆ మధ్య ఉత్తర ప్రదేశ్ లో ఓ 50 సంవత్సరాల మహిళ.. పాతిక సంవత్సరాలు అబ్బాయిని ప్రేమించింది. ఆ తర్వాత అతడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇక ఇటువంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. మీడియానో, సోషల్ మీడియా ద్వారానో వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఘటనలు సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ఇవి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి.. అనే ప్రశ్నకు సమాధానం ఓ పాడ్ కాస్ట్ ద్వారా లభించింది.
శుభంకర్ మిశ్రా.. అనే హిందీ జర్నలిస్ట్ ఇటీవల ఒక పాడ్ కాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీమ ఆనంద్ అనే మహిళ హాజరయ్యారు. ఈమె మానసిక నిపుణురాలు. లైంగిక పరమైన అంశాలపై అనేక పుస్తకాలు రాశారు. ఈమె లోతైన విశ్లేషణ చేస్తారు. అందువల్లే ఈమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమెను లక్షల మంది అనుసరిస్తుంటారు. ఇటీవల మిశ్రా నిర్వహించిన పాడ్ కాస్ట్ లో సీమ పాల్గొన్నారు. సమాజంలో పెరిగిపోతున్న అనైతిక సంబంధాలకు దారితీస్తున్న పరిస్థితులపై లోతైన విశ్లేషణ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
” ఆడవాళ్లకు ప్రతి విషయం మీద ఒక అవగాహన ఉంటుంది. తమ జీవిత భాగస్వామి నుంచి నిర్లక్ష్యాన్ని ఏమాత్రం వారు తట్టుకోలేరు. చులకనగా మాట్లాడడం ఓర్చుకోలేరు. ప్రేమ పూర్వక సంభాషణలను నిత్యం కోరుకుంటారు. సున్నితమైన అంశాలను పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇటువంటివి దూరమైతే వారు తట్టుకోలేరు. అందువల్లే వారు వేరే బంధం వైపు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవలంలో చాలామంది యువకులకు పెళ్లిలు కావడం లేదు. దీంతో మధ్య వయసు ఉన్న మహిళలలో చాలామంది యువకులతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ఇది తప్పని తెలిసినప్పటికీ వారికి తప్పడం లేదు. కాకపోతే ఇటువంటి బంధాలను ఎట్టి పరిస్థితిలో సమాజం ఒప్పుకోదు. అందువల్ల చాలామంది వివాహాలు కూడా చేసుకుంటున్నారని” సీమ అభిప్రాయపడ్డారు.
ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సీమ ఆనంద్ ఇంకా అనేక విషయాలు చెప్పారు. వివాహానికి ముందు యువతి యువకులు లైంగిక సంబంధాలు కొనసాగించడం.. వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి.. వివాహానికి ముందు ఆ సుఖాన్ని కోరుకోవడానికి యువత ఎందుకు ఆసక్తి చూపిస్తుంది? వాటి విషయాలను సీమా ఆనంద్ చాలా లోతుగా విశ్లేషించారు. ఈ వీడియోలను విభాగాలుగా విభజించి మిశ్రా పోస్ట్ చేయడంతో.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వీడియోలను అశ్లీల కంటెంట్ అని కొంతమంది వాదిస్తున్నారు. చాలామంది మాత్రం ఈ కాలపు మనుషులకు ఈ వీడియోలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

