https://oktelugu.com/

సాంకేతికతతో నకిలీ విత్తనాలకు చెక్..

రైతులు నాసిరకం విత్తనాలతో మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ విత్తనాలతో అన్నదాతలు నిత్యం ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. దీనివల్ల రైతు తన సమయాన్ని నష్టపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నుంచి రైతులను గట్టేక్కించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. సాంకేతికతను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైంది. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు చేపడుతుంది. ఇక నుంచి తయారుచేసే ప్రతీ పత్తి విత్తన ప్యాకెట్లపై బార్ లేదా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 30, 2020 / 04:54 PM IST
    Follow us on


    రైతులు నాసిరకం విత్తనాలతో మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ విత్తనాలతో అన్నదాతలు నిత్యం ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. దీనివల్ల రైతు తన సమయాన్ని నష్టపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నుంచి రైతులను గట్టేక్కించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. సాంకేతికతను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైంది. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు చేపడుతుంది. ఇక నుంచి తయారుచేసే ప్రతీ పత్తి విత్తన ప్యాకెట్లపై బార్ లేదా క్యూఆర్ కోడ్ ను తప్పనిసరిగా ముద్రించాలని విత్తన కంపెనీలను కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈమేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయశాఖ తగు చర్యలు చేపట్టాలని సూచించింది.

    పత్తి ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ విధానం వల్ల విత్తనాన్ని ఉత్పత్తి చేసిన కంపెనీ, ప్రాంతం, మార్కెటింగ్ చేసిన సంస్థ, రిటైలర్ డీలర్, సాగుచేసిన రైతు తదితర వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది. క్యూఆర్ లేదా బార్ కోడ్ ఉన్న పత్తి ప్యాకెట్లనే రైతులకు అందుబాటులో ఉంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లాట్ నంబర్, లేబులింగ్ ఉంచాలని సూచించింది. ఈ నిర్ణయం వల్ల పత్తి రైతులు మోసపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెబుతోంది. అయితే ఈ నిర్ణయం కేవలం పత్తి ప్యాకెట్లు తయారు చేసే కంపెనీలకేనా? లేదా అన్ని విత్తనాల కంపెనీలకు వర్తిస్తుందా అనేది క్లారిటీ స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా సాంకేతికతతో రైతుల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ముందుకు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.