Secretariat employees: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయం సరైనది కాదని ఉద్యోగులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. శాశ్వత ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు మాత్రం నిరాశే మిగిల్చింది. ఉద్యోగంలో చేరి అక్టోబర్ నాటికే రెండేళ్లయినా ప్రభుత్వం ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈ ఏడాది జూన్ లోగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ప్రకటించడంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
దీంతో వారు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి నిష్క్రమించారు. దీంతో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. శనివారం ఉదయం నుంచే అధికారిక గ్రూపుల నుంచి గంటల వ్యవధిలోనే ఉద్యోగులు బయటకు రావడం సంచలనం కలిగించింది. దీంతో ఉన్నతాధికారులకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రొబేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయ ఉద్యోగుల్లో చాలా మంది విధుల్ని బహిష్కరించి సమ్మె చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఆందోళన చేయడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయే అవకాశం ఏర్పడింది. ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినా ఉద్యోగులు మాత్రం పట్టించుకోవడం లేదు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు.
ఓటీఎస్ పథకానికి సంబంధించి రాష్ర్టవ్యాప్తంగా మెగా మేళాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఉద్యోగుల విధుల బహిష్కరణ ఓ గుదిబండలా మారుతోంది. ఇప్పుడు ఉద్యోగులు ఆందోళన బాట పడితే పనులు ఎలా సాగుతాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉద్యోగులు ఆందోళన విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం పట్టించుకోవడం లేదు.
Also Read: Chandrababu: జూనియర్ కు దూరంగా.. పవన్ కు దగ్గరగా.. మారుతున్న చంద్రబాబు సమీకరణాలు..!
సచివాలయ ఉద్యోగులకు రూ.15 వేల వేతనం తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. దీంతో వారిలో నైరాశ్యం పెరుగుతోంది. దీంతో ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఉద్యోగులు గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అనంతరం కమిషనర్, డిప్యూటీ చైర్మన్ లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. దీంతో ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చనే సంకేతాలు వస్తున్నాయి.
Also Read: Jagan Praja Sankalpa Yatra: జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’కు నేటితో మూడేళ్లు.. ఏమేం చేశారంటే..?