KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంటారని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. అది నిజమే కూడా. ప్రత్యర్థుల కంటే ముందర తన వ్యూహాలకు పదును పెడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోందది. ఈ క్రమంలోనే తాజాగా కమ్యూనిస్టు పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలతో భేటీ అయ్యారు.

లెఫ్ట్ పార్టీ నేతలకు ప్రగతి భవన్‌లో కేసీఆర్ విందు కూడా ఇచ్చారు. అలా బీజేపీ వ్యతిరేక వైఖరిని కేసీఆర్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే మొదట వామపక్షాలను ఏకం చేస్తున్న కేసీఆర్.. త్వరలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలుస్తారని తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేసిన కేసీఆర్.. త్వరలో ఆ విషయమై ఫుల్ ఫోకస్ పెడతారని టాక్. ఇందులో భాగంగానే తాజాగా కమ్యూనిస్టులతో మంతనాలు జరుపుతున్నారట.
తెలంగాణలో కమ్యూనిస్టులతో కేసీఆర్ దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్‌కే వామపక్షాల మద్దతు లభించింది. ఈ క్రమంలోనే కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని డిసైడ్ అయనట్లు టాక్. ఇన్నాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాల్లో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. అయితే, గతంతో పోల్చితే కమ్యూనిస్టుల ప్రభావం చాలా తగ్గిన మాట వాస్తవం.
Also Read: Srisailam: శ్రీశైలంలో మత విద్వేషాలు రగలడానికి కారణాలేంటి?
అయినప్పటికీ కమ్యూనిస్టులతో జట్టు కట్టడం వల్ల ఎంతో కొంత లాభం చేకూరొచ్చని గులాబీ పార్టీ అధినేత భావిస్తున్నారట. దేశంలో కేరళ రాష్ట్రంలో తప్ప ఎక్కడా కమ్యూనిస్టులు అధికారంలో లేరు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్‌కు కేసీఆర్ నేతృత్వంలో అడుగులు పడతాయా? లేదా ? అనేది భవిష్యత్తులోనే తేలనుంది. గతంలో ఒడిశా ముఖ్యమంత్రిని కేసీఆర్ కలిసిన సంగతి అందరికీ విదితమే. ఈ సారి కూడా మళ్లీ అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను కేసీఆర్ కలుస్తాడో చూడాలి.
Also Read: KCR Politics: టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చే స్కెచ్ వేసిన కేసీఆర్?
[…] […]