https://oktelugu.com/

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాధ్యమైందని ప్రతీఒక్కరి నమ్మకం. అందుకే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచే టీఆర్ఎస్ కే ప్రజలు పట్టంగట్టారు. దీంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి కొత్తశకాన్ని ప్రారంభించారు. ధనిక రాష్ట్రంగా ఆవిర్భావించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారు. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. వీరితోపాటు తెలంగాణలోని అన్నివర్గాలను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 2:23 pm
    Follow us on


    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాధ్యమైందని ప్రతీఒక్కరి నమ్మకం. అందుకే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచే టీఆర్ఎస్ కే ప్రజలు పట్టంగట్టారు. దీంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి కొత్తశకాన్ని ప్రారంభించారు. ధనిక రాష్ట్రంగా ఆవిర్భావించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారు. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. వీరితోపాటు తెలంగాణలోని అన్నివర్గాలను ఆకట్టుకునే పథకాలను ప్రవేశపెట్టి అందరివాడిలా గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్ ఐదేళ్ల పాలన పూర్తికాకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్షాలను ఢిపెన్స్ లో పడేశారు. ఈ ఎన్నికల్లో కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లడంతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది.

    జగన్ టీంలోకి దూకుడు బ్యాచ్!

    అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయనకు అనేక సవాళ్లు ఎదురయ్యారు. పార్టీలోని సీనియర్లను పక్కకు పెడుతూ వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక చాలామందికి మంత్రి పదవులు ఇవ్వకుండా కొంతకాలం దూరం పెట్టారు. కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. కేసీఆర్ క్యాబినెట్లోనూ కేటీఆర్ కు సన్నిహితులైన వారికే అవకాశం ఇవ్వడం.. హరీష్ రావు, ఈటల రాజేందర్ నేతలను కొంతకాలం పక్కకు పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

    సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్టు ఉండటం, ఆయనకు ఆరోగ్యం సహకరించడం వల్ల సీఎంగా కేటీఆర్ ను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని సీఎంగా తనే కొనసాగుతానని.. మీకు బాగోలేదంటే చెప్పండి.. తప్పుకుంటా అంటూ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కేటీఆర్, హరీష్ రావు, రాజేందర్ లను క్యాబినెట్లోకి తీసుకోవడంతో కొంతకాలం కొత్త సీఎం చర్చ ఆగిపోయింది.

    జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

    చైనా నుంచి కరోనా వైరస్ కేసీఆర్ పాలిట శాపంగా మారింది. తెలంగాణలో తిరుగులేకుండా పోతున్న కేసీఆర్ సర్కార్ కు కరోనా ఛాలెంజ్ విసిరింది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో చేతులెత్తినట్లు కన్పిస్తుండటంతో సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ సమయంలోనూ సీఎం కేసీఆర్ సచివాలయం కూల్చివేతకు ప్రాధాన్యం ఇవ్వడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నారు. సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినప్పటికీ సర్కార్ పట్టించుకోకుండా కూల్చివేతకే ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రజల్లో చర్చ మొదలైంది.

    సీఎం కేసీఆర్ తొలి నుంచి జాతకాలు, వాస్తు, న్యూమరాలజీని నమ్ముతుంటారని అందరికీ తెల్సిందే. వచ్చే ఎన్నికల నాటికి సీఎం సీటు మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేటీఆర్ జాతకానికి ప్రస్తుత సచివాలయం అనువుగా లేదనే అందుకే సచివాలయాన్ని కూల్చివేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి వారంతా ఓ కారణం చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ సచివాలయం నుంచి పనిచేయగా వారి వారసులెవరు కూడా ముఖ్యమంత్రులు కాలేదని లాజిక్ చూపిస్తున్నారు.

    దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ చనిపోయాక సీఎంగా జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చిన చివరికీ కాలేదని చెబుతున్నారు. అందువల్లే పక్క రాష్ట్రంలో సీఎం అయ్యారని చెప్పుకుంటున్నారు. దీంతో కేసీఆర్ తన తనయుడి జాతకం ప్రకారంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతుందోగానీ ప్రతిపక్షాలు మాత్రం కేటీఆర్ ను సీఎం చేసేందుకు సచివాలయాన్ని కూల్చివేస్తున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సస్ అయినట్లు కన్పిస్తుంది. ఓవైపు కరోనా.. మరోవైపు సచివాలయం కూల్చివేతతో సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శలను సీఎం కేసీఆర్ ఏవిధంగా చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే..!