కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?

రోగం కంటే.. భయమే మనిషిని పిరికివాడిగా మారుస్తుందనే నానుడి ప్రతీఒక్కరు వినే ఉంటారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా విషయంలోనూ అదే జరుగుతుందనే మాట విన్పిస్తోంది. ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా మరోవైపు కరోనాపై వస్తున్న ప్రచారాలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా సోకినపుడు రోగికి ఉండే లక్షణాలు ఏంటీ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికీ కూడా ఎవరికీ సరైన అవగాహన లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందంటే.. […]

Written By: Neelambaram, Updated On : July 11, 2020 2:11 pm
Follow us on

రోగం కంటే.. భయమే మనిషిని పిరికివాడిగా మారుస్తుందనే నానుడి ప్రతీఒక్కరు వినే ఉంటారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా విషయంలోనూ అదే జరుగుతుందనే మాట విన్పిస్తోంది. ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా మరోవైపు కరోనాపై వస్తున్న ప్రచారాలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా సోకినపుడు రోగికి ఉండే లక్షణాలు ఏంటీ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికీ కూడా ఎవరికీ సరైన అవగాహన లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఎందుకిలా చెప్పాల్సి వస్తుందంటే.. కరోనా లక్షణాల లిస్టులో రోజుకో లక్షణం వచ్చి చేరిపోతూ చాంతడంత అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా లక్షణాలపై పూర్తి క్లారిటీ లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ ఇప్పటివరకు మూడుదశల్లో కరోనా లక్షణాలను ప్రకటించింది. కరోనా సోకినవారు దగ్గినపుడు, తుమ్మినపుడు వైరస్ సోకుతుందని తొలుత డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆ తర్వాత జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర లక్షణాలుంటాయని తెలిపింది. తాజాగా తుంపర్లు, గాలిద్వారా కూడా కరోనా సోకుందని పలువురు వైద్య నిపుణులు వాదించగా డబ్ల్యూహెచ్ఓ సైతం నిజమేనంటూ నిర్ధారించింది.

కరోనా మహమ్మరి లక్షణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యులకు సైతం కరోనా వైరస్ పుట్టుక, లక్షణాలపై సరైన అవగాహన లేకుండానే చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తమ ప్రాణాలను పణంగాపెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా కరోనా కేసులు నమోదైన తర్వాత తాజాగా గాలి ద్వారా కూడా కరోనా సోకుతుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు నిరంతరం శ్రమిస్తున్నారు. వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తుండటంతో వ్యాక్సిన్ తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ రేయింబవళ్లు సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నారు. వాక్సిన్ ప్రయోగాలు సత్ఫలిస్తున్న తరుణంలో రోజుకో వైరస్ లక్షణం బయటపడటం ఆందోళన రేపుతోంది. మరోవైపు వైరస్‌ సోకిన వారికి చికిత్స చేయడంలో వైద్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

తాజాగా గాలి ద్వారా కరోనా సోకుతుందని నిర్ధారణ కావడంతో తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ మహమ్మరి బారినపడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags