https://oktelugu.com/

‘రాధేశ్యామ్‌’ రికార్డులు షురూ

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన కొత్త సినిమా మూవీ ఫస్ట్‌ లుక్‌ శుక్రవారం విడులైంది. ఈ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది. ప్రచారంలో ఉన్న ‘రాధేశ్యామ్‌’ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 / 02:40 PM IST
    Follow us on


    యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన కొత్త సినిమా మూవీ ఫస్ట్‌ లుక్‌ శుక్రవారం విడులైంది. ఈ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది. ప్రచారంలో ఉన్న ‘రాధేశ్యామ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. రాయల్ క్యాస్టూమ్స్‌లో ప్రభాస్‌, పూజా హెగ్డే రొమాంటిక్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఫస్ట్‌లుక్‌ చూసి ఫిదా అయ్యారు. సోషల్‌ మీడియాలో షేర్, లైక్‌ చేస్తూ రెబల్‌ స్టార్పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దాంతో, రాధేశ్యామ్‌ పోస్టర్ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డుల వేట మొదలు పెట్టింది.

    జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

    ఈ ఫస్ట్‌లుక్‌ ట్విటర్‌లో నిన్న టాప్‌ ట్రెండింగ్‌లో చోటుదక్కించుకోవడమే కాకుండా తక్కువ సమయంలో సింగిల్‌ హాష్‌ట్యాగ్‌లతో 3.8 మిలియన్లకు పైగా ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించింది. మరోవైపు సినిమా పరిశ్రమకు చెందిన ఇతర నటీనటులు, ప్రముఖులు కూడా ట్విటర్‌ ద్వారా ‘రాధేశ్యామ్‌’ చిత్రయూనిట్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ల అభిమానుల ద్వారా కూడా ఫస్ట్‌లుక్‌ మరింత ట్రెండింగ్‌గా మారింది. దాంతో #RadheShyam హాష్‌ట్యాగ్‌ హవా కొనసాగింది. అదే టైమ్‌లో మరో ఇన్సిడెంట్‌ కూడా ప్రభాస్‌ కొత్త మూవీ ప్రమోషన్‌కు పనికొచ్చింది. అదేంటంటే ‘బాహుబ‌లి: ది బిగినింగ్’ సినిమా విడుదలై శుక్రవారానికి ఐదేళ్లు పూర్తవడం. దాంతో, అటు రాధేశ్యామ్‌.. ఇటు బాహుబలి ఫైవ్‌ ఇయర్స్‌, ప్రభాస్‌ పేర్లతో పలు హాష్‌ట్యాగ్‌లు శుక్రవారం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. రాధేశ్యామ్‌ లుక్‌తో పాటు బాహుబలి ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. చాలా మంది వాటిని రీట్వీట్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఒక్కరోజులోనే పలు రికార్డులు బద్దలు కొట్టిన ‘రాధేశ్యామ్‌’ మున్ముందు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.