
సీఎం కేసీఆర్ ఏం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుందంటారు. ఆయన మౌనంగా ఉంటే ఏదో ప్రత్యర్థుల కొంపలు అంటుకునే పని చేస్తున్నాడని అర్థం.. ఆయన జనంలోకి విస్తృతంగా వస్తే ఏదో పెద్ద స్కెచ్చే వేస్తున్నాడని అనుకోవాలి. కేసీఆర్ చర్యలు ఊహాతీతం అంటారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల్లోనే కేసీఆర్ రెండోసారి ఢిల్లీ టూర్ పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఊరికే వెళ్లరు మహానుభావులు అన్నట్టుగా కేసీఆర్ ఢిల్లీ టూర్ పై ఇప్పుడు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
సీఎం కేసీఆర్ రెండోసారి ఢిల్లీ టూర్ ను మీడియా సాధారణంగా తీసుకుంది. అసలు ప్రధానంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక ‘అమిత్ షా’ మీటింగ్ కారణమని ప్రకటించారు. తీవ్రవాద రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో అమిత్ షా మీటింగ్ పెట్టగా.. దానికి కేసీఆర్ హాజరు కాబోతున్నారని తెలిపారు. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక ఏదో మతలబు ఉందని అనిపిస్తోంది. ఇలాంటి మీటింగ్ లు గతంలో ఎన్నో జరిగాయి. కేసీఆర్ చాలా సార్లు డుమ్మా కొట్టారు. ఆఖరుకు ఏపీ సీఎం జగన్ కూడా ఈ మీటింగ్ కు హాజరు కానని నిన్నే వైదొలిగారు. కానీ కేసీఆర్ ఎందుకు వెళుతున్నారు? ఎవరినో ఒకరిని పంపించే వీలున్నా కేసీఆర్ మాత్రమే ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత కేసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ మూడు రోజుల ముందు వెళ్లడానికి కారణం ఏంటన్నది అందరూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తొందరగా ఎక్కడికి వెళ్లరు. అలాంటి కేసీఆర్ మూడు రోజులు ఢిల్లీకి వెళ్లడం వెనుక మతలబు ఏంటని అనుమానిస్తున్నారు.
అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్ సర్వసాధారణమైనది అయితే కేసీఆర్ వెళ్లేది కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కీలకమైన భేటికి అని సమాచారం. అక్టోబర్ 14 నుంచి కృష్ణబోర్డు-గోదావరి బోర్డు సహా అన్ని బోర్డులను కేంద్రం తన చెప్పు చేతుల్లోకి పెట్టుకోబోతోంది. రెండు రాష్ట్రాలను చెరో 200 కోట్లు జమ చేయాలని కేంద్రం చెప్పింది. కేంద్ర సెక్యూరిటీ దళాలను మోహరిస్తోంది. స్టాఫ్ కూడా వారే.. వాళ్ల ఆధీనంలోనే ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఏపీ-తెలంగాణ జలవివాదాల వేళ ఇదో పెద్ద గేమ్ చేంజర్. అందుకే కీలకమైన ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు వెలువరించేలా ప్రయత్నాలు చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్.. ‘కేసీఆర్ రెండోసారి ఢిల్లీ పర్యటన వెనుకున్న మరిన్ని రహస్యాల’పై ‘రామ్ టాక్’ స్పెషల్ వీడియో మీకోసం..
వీడియోను కింద చూడొచ్చు