దేశంలోని గ్రామాలలో ఎక్కువమంది పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అయితే పాల వ్యాపారం వల్ల కొంతమంది భారీ మొత్తంలో సంపాదిస్తుంటే మరి కొందరు నష్టాల పాలవుతుండటం గమనార్హం. కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా పాల వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆవులు, గేదెలకు ఏ వ్యాధి వచ్చినా వెంటనే వైద్య చికిత్స చేయించాలి.
పశువులను జాగ్రత్తగా చూసుకుంటే మాత్రమే ఈ వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రమతో కూడిన వ్యాపారం అయినప్పటికీ ఓపికతో చేస్తే మాత్రమే ఈ వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పాలు స్వచ్చంగా లేకపోతే పాల ద్వారా ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అతిసారం, విరేచనాలు, క్షయ, మాల్టా జ్వరం, ఇతర వ్యాధులకు పాలు కారణమని చెప్పవచ్చు.
పశువులకు వైద్య చికిత్స అందకపోతే పాల ద్వారా ఈ వ్యాధులు మనుషులకు వచ్చే అవకాశాలు ఉంటాయి. పశువుల పాలు పితికే సమయంలో చేతివేళ్లకు ఎలాంటి గాయాలు ఉండకుండా చూసుకోవాలి. పొదుగును మంచి నీటితో శుభ్రం చేసి పాలు తీసే సమయంలో ఈగలు, గోమలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో పాలను వేడి చేసి పాలు చల్లారిన తర్వాత మూత పెడితే మంచిది.
పాల ఉత్పత్తిలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు. పశువులకు యజమానులు ధాన్యం, మేత, పచ్చిగడ్డి అందేల చూడటంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో పాలు పితకాలి. ఇలా చేస్తే పాలు ఎక్కువరోజులు శుభ్రంగా ఉంటాయి. పాలు పితికే ప్రదేశం, పాత్రలు శుభ్రంగా లేకపోతే పాలు దుర్వాసన వచ్చే అవకాశం ఉండటంతో పాటు పాలు త్వరగా చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది.