https://oktelugu.com/

చమురు ధరలపై బాబు వైఖరి వెనుక రహస్యం..!

పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు సామాన్యులకు భారంగా మారింది. కరోనా నేపథ్యంలో రెండు నెలలు కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రజలు ఆర్ధికంగా లాడుతుంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను రోజు, రోజు పెంచుకుంటూ పోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 15 రోజుల్లో డీజిల్ పై లీటరుకు రూ.8.88, పెట్రోల్ పై లీటరుకు రూ.7.97 ధర పెరిగింది. ఓ పక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉండటం […]

Written By: , Updated On : June 23, 2020 / 06:05 PM IST
Follow us on


పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు సామాన్యులకు భారంగా మారింది. కరోనా నేపథ్యంలో రెండు నెలలు కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రజలు ఆర్ధికంగా లాడుతుంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను రోజు, రోజు పెంచుకుంటూ పోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 15 రోజుల్లో డీజిల్ పై లీటరుకు రూ.8.88, పెట్రోల్ పై లీటరుకు రూ.7.97 ధర పెరిగింది. ఓ పక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉండటం ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

చమురు ధరలు విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరి విడ్డురంగా ఉంది. పెంచిన చమురు ధరలు తగ్గించాలని కోరడంతో తప్పులేదు. ఆయన కేంద్రన్ని చమురు ధరలు తగ్గించమని ఆ పార్టీ తరుపున డిమాండ్ చేసే ధైర్యం చేయడం లేదు. కేంద్రాన్ని ధరలు తగ్గించమని రాష్ట్ర ప్రభుత్వం కోరాలని డిమాండ్ చేయడం విడ్డురంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విధించే సెస్ తగ్గించమని కోరారు అంతవరకూ బాగానే ఉన్నా కేంద్రం విషయంలో ఆయన వైఖరిని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఇతర రాష్ట్రాల కంటే అధిక సెస్సు విధించడంతో రాష్ట్రంలోని పెట్రోల్ బ్యాంకుల యజమానులు ఆందోళనలు చేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా ఒరిస్సాలలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో లారీల యజమానులు అక్కడే ఇంధనాన్ని నింపుకోవడంతో మా వ్యాపారాలు ముసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బాంక్ లలో అమ్మకాలే లేవని పెట్రోల్ బంకుల యజమానుల సంఘము అప్పట్లో పలుమార్లు మీడియాకు వివరాలు వెల్లడించి, అప్పటి సీఎం, ఆర్ధిక మంత్రులకు వినతి పత్రాలు సమర్పించింది. చివరికి స్వచ్చందంగా ఆదివారాలు విక్రయాలు నిలిపివేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి సెస్సును 2018లో రాష్ట్రం విధించిన సెస్సు తగ్గించింది. దీని వెనుక ఉన్న కథ చెప్పని ప్రతిపక్షనేత చంద్రబాబు తాను ప్రజల కోసమే సెస్ తగ్గించినట్లు ప్రజలను మభ్య పెడుతున్నారు.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

మరోవైపు కేంద్రాన్ని చమురు ధరలు తగ్గించాలని వత్తిడి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి, సీఎం జగన్ కు సూచిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజల కోసం ప్రతి పక్ష స్థానంలో ఉన్న టీడీపీ కేంద్రాన్ని చమురు ధరలు తగ్గించమని కోరకూడదా?, ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని సీపీఐ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. కానీ టీడీపీ మాత్రం కేంద్రానికి వ్యతిరేకంగా కనీసం ప్రకటన కూడా చేయకుండా కేంద్రంపై వత్తిడి తేవాలని రాష్ట్ర సీఎం జగన్ కు సూచించడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. తన రాజకీయ లబ్ధికోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా కాలక్షేపం చేస్తూ, సీఎంను కేంద్రంపై వత్తిడి తేవాలని కోరుతుందనేది వాస్తవం.