రేవంత్ రెడ్డికి కొత్త పోటీని తెచ్చిన కాంగ్రెస్ సీనియర్లు?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కానీయవద్దని డిసైడ్ అయిన కాంగ్రెస్ సీనియర్లు తాజాగా కొత్త పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పదవి దక్కకుండా చేయాలని.. కాంగ్రెస్ లోనే అనాదిగా ఉన్న యువ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేతను తెరపైకి తెచ్చారు. ఇంతకీ ఎవరాయన.? ఎందుకు ఆయనను టీపీసీసీ చీఫ్ రేసులోకి తెచ్చారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు పడవల […]

Written By: NARESH, Updated On : June 23, 2020 5:47 pm
Follow us on


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కానీయవద్దని డిసైడ్ అయిన కాంగ్రెస్ సీనియర్లు తాజాగా కొత్త పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పదవి దక్కకుండా చేయాలని.. కాంగ్రెస్ లోనే అనాదిగా ఉన్న యువ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేతను తెరపైకి తెచ్చారు. ఇంతకీ ఎవరాయన.? ఎందుకు ఆయనను టీపీసీసీ చీఫ్ రేసులోకి తెచ్చారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

టీపీసీసీ రేసులోకి అనూహ్యంగా యువ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి వచ్చాడు. ఈ మాజీ ఎమ్మెల్యేగా సడన్ గా కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తాజాగా ప్రెస్ మీట్లలో క్రమం తప్పకుండా మాట్లాడుతున్నారు. మీడియాలో హైలెట్ అవుతున్నారు.

కాంగ్రెస్ రాజకీయాల్లో వంశీచంద్ రెడ్డి పాత్ర ఎలా సడన్ గా పెరిగిందని ఆరాతీయగా.. టీపీసీసీ రేసులోకి కాంగ్రెస్ సీనియర్లు అంతా వంశీచంద్ రెడ్డిని తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ అవ్వకుండా ఆపాలన్నది కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళిక. కానీ రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ హైకమాండ్ ఉందని సమాచారం. అందుకే ఆయనకు కౌంటర్ గా ధృడమైన యువ నేతను తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారట.. ఈ క్రమంలోనే యంగ్, ఫైర్ బ్రాండ్, చురుకైన వంశీ చంద్ రెడ్డిని రేవంత్ రెడ్డి వంటి శక్తివంతమైన నేతకు పోటీగా దింపారట.. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడం కూడా రేవంత్ రెడ్డికి మైనస్ గా మారిందంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి మాదిరే వంశీచంద్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేనే. రేవంత్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో వంశీ చంద్ అనాదిగా పార్టీని నమ్ముకొని ఉన్నాడని ఆయననే పీసీసీ చీఫ్ చేయాలని హైకమాండ్ కు ప్రతిపాదిస్తున్నారట.. మొత్తంగా రేవంత్ రెడ్డిని బలహీన పరిచే కుట్రలకు టీ కాంగ్రెస్ సీనియర్లు గట్టిగానే చేస్తున్నారని అర్థమవుతోంది.

-ఎన్నం