కొడాలి నాని.. వివాదాస్పద వ్యాఖ్యల ఖని..!

కొడాలి నాని.. ఈ పేరంటే తెలియని ఏపీ వాసులు ఉండడు.. ఏపీ రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్.రాజకీయాల్లోనే కొడాలి నానికి పిచ్చ క్రేజీ వచ్చింది.. ఒకప్పుడు టీడీపీలో.. ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే తాను చేసిన విమర్శల్లో ఎన్నడూ వెనక్కి రాలేదు. పదునైన మాటలతో ప్రతిపక్షాల నాయకులను ముప్పుతిప్పలు పెడుతున్న కొడాలి నాని పేరు రాష్ట్రంలోనే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా వారి నోట నానుతుంది. టీడీపీలో ఉన్నప్పటి కంటే వైసీపీలోకి వచ్చిన తరువాత ఈ నేత […]

Written By: NARESH, Updated On : February 7, 2021 4:20 pm
Follow us on

కొడాలి నాని.. ఈ పేరంటే తెలియని ఏపీ వాసులు ఉండడు.. ఏపీ రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్.రాజకీయాల్లోనే కొడాలి నానికి పిచ్చ క్రేజీ వచ్చింది.. ఒకప్పుడు టీడీపీలో.. ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే తాను చేసిన విమర్శల్లో ఎన్నడూ వెనక్కి రాలేదు. పదునైన మాటలతో ప్రతిపక్షాల నాయకులను ముప్పుతిప్పలు పెడుతున్న కొడాలి నాని పేరు రాష్ట్రంలోనే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా వారి నోట నానుతుంది. టీడీపీలో ఉన్నప్పటి కంటే వైసీపీలోకి వచ్చిన తరువాత ఈ నేత ఎక్కువగా ప్రజాదరణ పొందారు.. ఎన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా సీఎం జగన్ మాత్రం ఆయనకు మద్దతుగానే ఉంటారు తప్ప ఎన్నడూ అలా మాట్లాడవద్దని చెప్పిన దాఖలాలు లేవు..

ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వమున్నా కొడాలి నాని మాత్రం ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. ఎందుకంటే ఏపీలోని హాట్ నియోజకవర్గమైన విజయవాడలోని గుడివాడ నుంచి ఈయన ప్రాతినిథ్యం వహిస్తారు కనుక. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజవర్గంలో కొడాలి నాని 2004 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు ఎన్టీఆర్ రామారావు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో నాని నాలుగు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు.

కొడాలి వెంకటేశ్వర్ రావు అలియాస్ నాని 1971 అక్టోబర్ 22న కృష్ణ జిల్లాలోని గుడివాడలో కొడాలి అర్జున్ రావు దంపతులకు కొడాలి నాని జన్మించారు. పదో తరగతి వరకు చదివి ఆపేసిన నాని చిన్నప్పటి నుంచే దూకుడుగా ఉండేవారు. ఆయనకు చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే మక్కువ. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమావేశాలకు ఎక్కువగా వెళ్తుండేవారు. తెలుగుదేశం తరుపున ఎటువంటి ర్యాలీ జరిగిన బడి మధ్యలో వచ్చేవారు. ఎన్టీఆర్ ఎమ్మెల్యే అయిన తరువాత టీడీపీలో కార్యకర్తలగా చేరిపోయారు.

ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు తోడుగా ఉంటూ రకరకాల పనులు చేసేవారు. దీంతో ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో చనువు పెంచుకున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అప్పట్లో వివి వినాయక్ తో కలిసి ‘ఆది’ సినిమాను నిర్మించారు. ఆ తరువాత ‘సాంబ’ సినిమా తీశారు. ఈ సినిమా ఆశించినత ఆడకపోవడంతో పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో హరికృష్ణ అండదండలతో తెలుగు యువత అధ్యక్షుడిగా పదవి పొందారు. ఆ తరువాత 2004లో హరికృష్ణ సపోర్టుతో గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత తన మాటల గారడితో చంద్రబాబును కూడా ఆకట్టుకున్నారు.

దీంతో 2009లో నూ టీడీపీ నుంచి టికెట్ పొందిన నాని అదే ఊపుతో గెలిచారు. అయితే హరికృష్ణ కుటుంబంతో చంద్రబాబుకు విభేదాలు రావడంతో నాని 2012లో టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత జగన్మోహన్ పార్టీ వైసీపీలో చేరారు. అయితే నాని వైసీపీలో చేరడానికి జూనియర్ ఎన్టీఆరే కారణమని ప్రచారం జరిగింది. ఇక 2014లో వైసీపీ నుంచి కొడాలి నాని ఎమ్మెల్యేగా హ్యట్రిక్ సాధించారు. దీంతో ఆయన పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు సంపాదించుకున్న నేతగా ఎదిగారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గుడివాడ కోడాలి నాని కంచుకోటగా మారిపోయింది.

2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు సాగించారు. అయితే కొడాలి నాని విమర్శల్లో బూతులు కూడా వినబడుతుంటాయి. దీంతో ఆయన వ్యాఖ్యలు ఎప్పటికీ వివాదాస్పదంగా మారుతాయి. అయినా ఆయన ఏమాత్రం జడవకుండా తనదైన శైలిలో ప్రవర్తిస్తుంటాడు.

2019లోనూ వైసీపీ తరుపున పోటీ చేసిన నాని టీడీపీ నుంచి పోటీచేసిన దేవినేని అవినాశ్ పై పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సందర్బంలో కొడాలి నాని ‘నన్ను ఓడించే మొగాడు గుడివాడలో పుట్టలేదు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడంలో నానికి మంత్రి పదవి దక్కింది. దీంతో ఆయన దూకుడుకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

గత కొన్ని రోజులుగా నాని దాదాపు ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. చంద్రబాబును బద్ధ శత్రువుగా మార్చుకున్న ఆయన ప్రతీ విషయంలో విమర్శిస్తూ ఎడాపెడా తిట్టేస్తుంటారు. కానీ తన నియోజకవర్గంలో మాత్రం కొడాలి నాని అంటే ప్రజల కోసం చేసే నేత అని ముద్ర పడిపోయింది. అయితే అభివృద్ధి విషయంలో కొన్ని హామీలు ఇచ్చిన ఆయన వాటిని ఇంతవరకు నెరవేర్చలేదని కొందరు అంటున్నారు