https://oktelugu.com/

బీహార్‌‌లో సీన్‌ రివర్స్‌.. ఆధిక్యంలోకి ఎన్డీఏ

బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠను తలపిస్తోంది. ఇటు ఎన్డీఏ, అటు మహాకూటమి తమ సత్తా చాటుతున్నాయి. ఆది నుంచీ ఆర్జేడీ ఆధిక్యం కనిపించినా మెల్లమెల్లగా మళ్లీ ఎన్డీఏ తన ఆధిక్యాన్ని చాటింది ఎట్టకేలకు ఎన్డీయే మ్యాజిక్‌ మార్క్‌కు చేరువైంది. ఓ దశలో 125 సీట్ల ఆధిక్యాన్ని అందుకున్న ఎన్డీఏ ప్రస్తుతం 120 సీట్ల వద్ద ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఆ వెంటనే మహాకూటమి 112 సీట్లతో తర్వాతి స్థానంలో ఉంది. Also Read: మధ్యప్రదేశ్‌ అప్‌డేట్స్‌: 9 […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 3:40 pm
    Follow us on

    Bihar Elections

    బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠను తలపిస్తోంది. ఇటు ఎన్డీఏ, అటు మహాకూటమి తమ సత్తా చాటుతున్నాయి. ఆది నుంచీ ఆర్జేడీ ఆధిక్యం కనిపించినా మెల్లమెల్లగా మళ్లీ ఎన్డీఏ తన ఆధిక్యాన్ని చాటింది ఎట్టకేలకు ఎన్డీయే మ్యాజిక్‌ మార్క్‌కు చేరువైంది. ఓ దశలో 125 సీట్ల ఆధిక్యాన్ని అందుకున్న ఎన్డీఏ ప్రస్తుతం 120 సీట్ల వద్ద ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఆ వెంటనే మహాకూటమి 112 సీట్లతో తర్వాతి స్థానంలో ఉంది.

    Also Read: మధ్యప్రదేశ్‌ అప్‌డేట్స్‌: 9 సీట్లు వస్తే బీజేపీదే అధికార పీఠం

    చిరాగ్‌ పాశ్వాన్‌ ఆధ్వర్యంలోని లోక్‌జనశక్తి పార్టీ మరో రెండు నుంచి మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది. 8 రౌంట్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఎన్డీయే 122 సీట్ల మ్యాజిక్‌ మార్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో 22 రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో కాస్త వెనుకబడిన జేడీయూ అభ్యర్థులు ఆ తర్వాత పుంజుకున్నారు. ప్రస్తుతం 57 సీట్లలో జేడీయూ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    Also Read: బీహార్ కా షేర్ తేజస్వి..మోడీ-నితీష్ కు షాక్ యేనా?

    మరోవైపు ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. జేడీయూ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పగా.. అనూహ్యంగా ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నట్లు ఇప్పుడున్న ఆధిక్యతను బట్టి చూస్తే అర్థమవుతోంది. అటు ఆర్జేడీ అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే.. మహాకూటమిలోని మిగతా మిత్రపక్షాల నుంచి ఆ పార్టీకి సహకారం కరువైంది. దీంతో ఆర్జేడీ అభ్యర్థులు మాత్రమే ముందంజలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్‌ ఉంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    మహాకూటమి సీఎం అభ్యర్థి కూడా అయిన తేజశ్రీ యాదవ్‌ రాఘవాపూర్‌‌ స్థానంలో ఆధిక్యతను చాటుతున్నారు. హసన్‌పూర్‌‌ నుంచి బరిలో నిలిచిన ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఊహించినట్లుగా వెనుకబడిపోయారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు కూడా వెనుకబడినట్లు తెలుస్తోంది.