https://oktelugu.com/

వెంకీ-రానా కాంబోపై మొదలైన నెగిటివ్ టాక్..! 

టాలీవుడ్లో కొద్దిరోజులుగా మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఈ మూవీలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శక, నిర్మాతలు సైతం ఇద్దరు హీరోలను పెట్టి సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టాలీవుడ్లో మల్టిస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..! మల్టిస్టారర్ మూవీల్లో విక్టరీ వెంకటేష్ నటించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో అతడి కాంబినేషన్లలోనే ఎక్కువ మల్టిస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. మహేష్ తో ‘సిరిమల్లె వాకిట్లో సీతమ్మ చెట్టు’.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 / 11:52 AM IST
    Follow us on

    టాలీవుడ్లో కొద్దిరోజులుగా మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఈ మూవీలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శక, నిర్మాతలు సైతం ఇద్దరు హీరోలను పెట్టి సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టాలీవుడ్లో మల్టిస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది.

    Also Read: ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..!

    మల్టిస్టారర్ మూవీల్లో విక్టరీ వెంకటేష్ నటించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో అతడి కాంబినేషన్లలోనే ఎక్కువ మల్టిస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. మహేష్ తో ‘సిరిమల్లె వాకిట్లో సీతమ్మ చెట్టు’.. పవన్ కల్యాణ్ తో ‘గోపాలగోపాల’.. వరుణ్ తేజ్ తో ‘ఎఫ్-2’.. నాగచైతన్యతో ‘వెంకీమామ’లో వెంకటేష్ నటించారు.

    తాజాగా రానా దగ్గుబాటితో విక్టరీ వెంకటేష్ నటించనున్నాడు. ఈమేరకు దగ్గుబాటి రానానే స్వయంగా ప్రకటించారు. త్వరలోనే వెంకటేష్-రానా కాంబోలో సినిమా వస్తుందని ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం ఈ కాంబినేషన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: ‘మెగా’ బాంబ్.. ఆచార్య మరింత ఆలస్యం?

    వెంకటేష్ ఇటీవల నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’లో నటించాడు. నిజజీవితంలో మామ అల్లుళ్లు అయిన వీరిద్దరు తెరపైకి అలానే నటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ప్రేక్షకుల అంచనాలను మాత్రం ‘వెంకీమామ’ అందుకోలేకపోయాడు. తాజాగా బాబాయ్.. అబ్బాయ్ లు సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    గతంలో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’లో వెంకీ ఓ పాటలో గెస్ట్ అప్పీయన్స్ ఇచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో వెంకీ-రానా కాంబోపై నెగిటివ్ కామెంట్స్  ను కొందరు ఫ్యాన్స్ షూరు చేస్తున్నారు. వెంకీ-రానా కాంబో మరో ‘వెంకీమామ’లా కాకుండా చూసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. సినిమా మొదలుపెట్టక ముందే ఈ కాంబోపై నెగిటివ్ టాక్స్ వస్తుండటంతో చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచిచూడాల్సిందే..!