Homeఆంధ్రప్రదేశ్‌జగన్ అత్యుత్సాహం.. బడి పిల్లలకు శాపంగా మారనుందా?

జగన్ అత్యుత్సాహం.. బడి పిల్లలకు శాపంగా మారనుందా?

Schools open in AP

ఎలుకకు ప్రాణసంకటం.. పిల్లికి చెలగాటం అన్నట్లు మారింది ఏపీలో పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే ఏపీలో సీఎం జగన్ సర్కార్ బడులు ఓపెన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 2 నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత్యంతరం లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూళ్లకు భయంభయంగా వెళ్లాల్సి వస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

సీఎం జగన్ ఏపీలో కరోనా నివారణకు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనా ఇంకా తగ్గముఖం పట్టలేదు. బడులను ప్రారంభించిన రోజునే ఏపీలో కరోనా ఎలా ఉందనేది బయట పడటం గమనార్హం. బడులు ఓపెన్ చేసిన తొలిరోజు 70మందికి కరోనా సోకినట్లు వెలుగుచూసింది. దీంతో ఉపాధ్యాయులతోపాటు బడి పిల్లలు.. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త… ఏపీలో 575 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు..?

ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, టీచర్లు కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పాఠశాల ఎంట్రెన్స్ లోనే విద్యార్థులకు థర్మల్ స్ర్కీనింగ్.. తరగతి గదులను శానిటైజర్ చేయడం వంటి చర్యలు చేపట్టారు. తొలి రోజు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ 70మందికి కరోనా సోకినట్లు బయటపడింది. అయితే కరోనా ఉన్నట్లు ఇప్పటివరకు వారికి కూడా తెలియకపోవడం గమనార్హం.

దీంతో బడులు ఓపెనింగ్ రోజునే ఏపీలో కరోనా సేకండ్ వేవ్ స్టాట్ అయిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా సేకండ్ వేవ్ ప్రారంభమైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఏపీలో బడులను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకున్న ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా ఏపీలో తెరవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: సీఎం జగన్ కరోనా కంటే డేంజర్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?

ఇప్పటికే విద్యాసంవత్సరం ఎలాగూ వృథా అయింది. ఇప్పుడు స్కూళ్లు తెరవడం వల్ల ప్రభుత్వానికిగానీ విద్యార్థులకుగానీ పెద్దగా ప్రయోజనమేమీ అలాంటి లేదు. అయినా జగన్ సర్కార్ అత్యుత్సాహం తో స్కూళ్లను ఓపెన్ చేయడంతో పిల్లల ప్రాణాలకు సంకటంగా మారింది. ఇప్పటికైనా సీఎం జగన్ విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని బడుల పునః ప్రారంభంపై తగిన నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version