ఎలుకకు ప్రాణసంకటం.. పిల్లికి చెలగాటం అన్నట్లు మారింది ఏపీలో పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే ఏపీలో సీఎం జగన్ సర్కార్ బడులు ఓపెన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. నవంబర్ 2 నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాలలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత్యంతరం లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూళ్లకు భయంభయంగా వెళ్లాల్సి వస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
సీఎం జగన్ ఏపీలో కరోనా నివారణకు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనా ఇంకా తగ్గముఖం పట్టలేదు. బడులను ప్రారంభించిన రోజునే ఏపీలో కరోనా ఎలా ఉందనేది బయట పడటం గమనార్హం. బడులు ఓపెన్ చేసిన తొలిరోజు 70మందికి కరోనా సోకినట్లు వెలుగుచూసింది. దీంతో ఉపాధ్యాయులతోపాటు బడి పిల్లలు.. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త… ఏపీలో 575 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు..?
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, టీచర్లు కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పాఠశాల ఎంట్రెన్స్ లోనే విద్యార్థులకు థర్మల్ స్ర్కీనింగ్.. తరగతి గదులను శానిటైజర్ చేయడం వంటి చర్యలు చేపట్టారు. తొలి రోజు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ 70మందికి కరోనా సోకినట్లు బయటపడింది. అయితే కరోనా ఉన్నట్లు ఇప్పటివరకు వారికి కూడా తెలియకపోవడం గమనార్హం.
దీంతో బడులు ఓపెనింగ్ రోజునే ఏపీలో కరోనా సేకండ్ వేవ్ స్టాట్ అయిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో కరోనా సేకండ్ వేవ్ ప్రారంభమైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఏపీలో బడులను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకున్న ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా ఏపీలో తెరవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సీఎం జగన్ కరోనా కంటే డేంజర్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?